పుట:కాశీమజిలీకథలు -09.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

చూచితిరి? మీగుఱ్ఱముతో సమముగా నడిపించుటచే విచిత్రగతు లేమియుం జూపుటకు వీలుపడినదికాదు.

రాజ - ఆహా! మీ వాహనము నింతకన్న జమత్కారముగా నడిపింపఁ గలరా?

పులింద — మదీయవిహారచమత్కారము చూతురుగాక యని పలుకుచు వెండియు గుఱ్ఱమెక్కి యా సందిద, ధోరితర, రేచిత, వల్గిత, ప్లుత, పంచవిధ గతివిశేషములం జూపుచు రాజకుమారుని హృదయము నాశ్చర్యసాగరంబున మునుఁగఁజేసెను.

రాజ - రాజవాహనునిఁ గౌగలించుకొని మహావీరా! నీ వశ్వశిక్షణమందు నకులుని మించితివి. ఇన్ని గతు లెఱింగినవాని నేను జూడలేదు. నీకు శిష్యుండ నయ్యెద నా కీపాటవము నేర్పెదవా?

పుళింద - మీరెవ్వరు ?

రాజ - నేను దుర్గనరాధీశ్వరుని కుమారుఁడ. నాపేరు సుమంతుఁడందురు.

పుళింద - మీరిక్కడి కేమిఁటికి వచ్చితిరి?

రాజ - చిలుకను గొన్ని ప్రశ్నలడుగుటకు.

పుళింద — అడిగితిరా? యథార్థముఁ జెప్పినదియా?

రాజ - అడిగితిని. ఎల్లుండి ప్రత్యుత్తరమిచ్చు దివసముగా నిరూపించిరి.

పుళింద - మీ రెందులకై యడిగితిరో చెప్పవచ్చునా? రహస్యమా?

రాజ - చెప్పకేమి? వివాహవిషయమై.

పుళింద - మీకేనా?

రాజ — అగును. మాతండ్రి నాకొక కన్యకను వివాహము జేయఁదలంచు చుండెను. అది నాకిష్టములేదు. అది తప్పునా? జరుగునా? అదియుఁ దప్పినచో నేదెస నెన్నినాళ్ళకు జరుగును, అని యడిగితిని.

పుళింద— ప్రత్యుత్తర మేమని యిచ్చునో చూడవలసినదే.

రాజ — మీరేమి యడిగితిరి! మీ నిరూపణదివసం బెప్పుడు?

పుళింద— నేనొకవస్తువుం గోరి యరుగుచుంటి నది లభించునా, లభింపదా? యని యడిగితిని. గడువింక పదిదినము లున్నది.

రాజ - (సంతస మభినయించుచు) ఈ పదిదినములు మీ శిశ్రూషఁ గావించెదఁ దురగవిద్యాపాటవము నేర్పుఁడు.

అని కోరికొనియెను. ఇరువురకు గాడమైన మైత్రి కలిసినది. నిత్యము కలిసి వాహ్యాలి సేయుచుందురు. ఆ మరునాఁడు సుమంతుఁ డడిగిన పశ్నములకు నుత్తరములు వచ్చినవి. అందిట్లున్నది. మీతండ్రి చేయఁదలచుకొన్న చిన్నది నీకు