పుట:కాశీమజిలీకథలు -09.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6]

శ్యామల కథ

41

జనులందరును కొని యామార్గమున వచ్చుచుండెను. గుఱ్ఱపురౌతులు బాకులరౌతులు వీరభటులు ఎవరిప్రాణములు వారు దక్కించుకొని పారిపోయిరి. ఒక్కవీరుండైన దానింబట్టుకొను నుపాయము నాలోచింపఁ డయ్యెను. ఆ మేళములు, ఆ తాళములు, ఆ వాద్యములు ఎందుఁ బోయినవో యొక్కటియుఁ గనఁబడలేదు. ఇంద్రజాలమువలె నా యుత్సవము గడియలో నదృశ్యమైనది. ఒక్కయేనుఁగమాత్రమే నిరాటంకముగా రాజవీధింబడి వచ్చుచుండెను. పైనున్న వధూవరుల తొండము వ్రేటులఁ దప్పించుకొనుచు నొంటిప్రాణములోనుండి చెట్టుగాని మేడగాని చేరిన నెక్కి యసువులఁ దక్కించుకొన వలయునని చూచుచున్నారు.

నిర్మానుష్యంబై యున్న యావీధిలో నడ్డముగాఁ నిలువంబడి యున్న రాజవాహనునిఁ జూచి యాకరివరం బతిశయంబున నతనిమీదికి వచ్చుచుండెను. అప్పు డశోకవతి అదిగో! మదగజంబు సమీపించుచున్నది. నీపైకే వచ్చుచున్నది. పారిపోవుదము రమ్మని కరమ్ముపట్టి లాగినది. అతండు కదలడయ్యెను. అప్పుడది హాహాకారముతో నందు నిలువక దూరముగాఁ బారిబోయి చాటుననుండి రాజవాహనునిం జూచుచు వానిం గతాంసుగా నిశ్చయించుకొని శోకించుచుండెను.

ఇంతలో నాదంతావళము వానియంతికమునకు వచ్చినది. అప్పుడు రాజువాహనుఁడు అమ్ము చేతం బూని పదియడుగులు దాని కెదురుపోయి హుంకారము సేయుచు మాతంగా! నిలునిలు నేనెవ్వఁడనో యెఱుంగుదువా పులిందచక్రవర్తి కుమారుండ. గదలిన నీమద మడఁగింతునని ఘీంకారపూర్వకముగా గొన్నిధ్వనుల వెలయఁజేసెను.

అప్పు డాదంతీంద్రంబు మంత్రించినట్లు శపించినట్లు, కట్టుకట్టినట్లు కదలక మెదలక యట్టె నిలువంబడినది. పిమ్మట నవ్వనచరకుమారుండు దాని దాపునకుఁ బోయి మనుష్యరుధిరమేధఁ కర్దమంబైన తదీయశుండాదండంబు బట్టుకొని దువ్వుచు నశోకవతీ! ఆశోకవతీ! ఎందున్నదాన విటురా అని పెద్దకేక పెట్టెను. దూరము నుండి చూచుచున్న యాపరిచారిక వానిసాహసమునకు వెఱఁగుఁ జెందుచున్న నటు పోవకున్ననుఁ దెగువమై వానిచెంత కరిగిననది.

అతండు నశోకవతీ? నేనండ నుండ నీవేదండమున కింకను వెఱచెద వేమిటికి? దీనిం బండుకొనఁ బెట్టెదఁ గట్టెదురకు రమ్ము అని పలికి కరస్థితచరప్రచలనంబునం సంజ్ఞచేసి నందివలె దానిం బండుకొనబెట్టెను. అప్పుడు అశోకవతి వెఱ పుడిగి దరి కరిగి యతనిం గౌఁగలించుకొని, వీరాగ్రేసరా? నీ పరాక్రమము, నీ ధైర్యము త్రిభువన స్తుత్యమై యున్నది. నీకతంబున నీవధూవరులు బ్రతికిరి! బహులోకోపకృతి గాంచితివని పొగడుచుండెను.

అప్పుడందున్న వధూవరు లతిశయంబుగా యేనుఁగం దిగి రాజవాహనుని పాదంబులంబడి మహాత్మా! నీవు మా ప్రాణములఁ గాపాడవచ్చిన భగవంతుఁడవని నమస్కరించుంటిమి. ఒరుల కీ యుపుద్రవము దాటించ శక్యమా? మూయుదల