పుట:కాశీమజిలీకథలు -09.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచ్చరల కథ

35

యనియుఁ దలంచుచు శ్రమణి యన్నతో జనాంతికముగా సహోదరా! కల్పలత కిన్ని వస్తువులు వెలగలవి యూరక మనకంపుటకుఁ గారణ మూహింపుము. మన మొకరిమొగ మొకరము చూచి యెఱుంగము. మనము పంపిన పక్షిజాతులకు వెలలు తీసుకొని యుంటిమి. అకారణవాత్సల్యురా లామె మైత్రి స్తోత్రపాత్రము కాదా? అనవుఁడు రాజవాహనుం డిట్లనియె.

రాజుల ధనమంతయు రాళ్ళపాలను సౌమెత వినియుండలేదా? అయినను మన మిన్నివస్తువు లూరక యామెవలనఁ గొననేల? ఈ పక్షినిమిత్త మీయెత్తు పన్నిన దేమో? ఎట్లయినను వీనికి బదులుగా నిజమగు నేనుఁగులు గుఱ్ఱములు మొదలగు సజీవజంతువుల నంపుదముగాక! అదియే మర్యాదయని చెప్పెను. వారిద్దరు పెద్దతడ వావిషయమై ముచ్చటించుకొనిరి.

రాజపుత్రిక మైత్రిని గుఱించి స్తోత్రము జేయుచు నా వస్తువులన్నియు స్వీకరించి యద్దముల పేటికలయం దుంచి యశోకవతిని కొన్నిదినములం దుండుమని కోరిరి. అశోకవతియు వారితోఁ జనువు గలుగఁజేసికొని యిష్టముగా మాట్లాడుచు నొకనాఁడు ప్రస్తావముగా నిట్లనియె.

రాజవాహనా! మీయొద్దనున్న శకుంతము మా రాజపుత్రికయొద్దనున్న శకుంతము భార్యాభర్తలు. ఇది మగది. అది ఆడుఁదియు పక్షిజాతి జంట విడఁదీసిన జీవింపదని చెప్పుదురు. ఇవి యాశ్రయబలంబునం జేసి కాబోలు సంతోషముతోనే యున్నవి దీనిమాట చెప్పలేను కాని మాయొద్దనున్న పని పౌరాణికుఁడగు సూతుండని చెప్పవచ్చును. అన్ని పురాణగాథలు, చమత్కారకథలు వినోదముగాఁ జెప్పగలదు. కాని దానియందొక దోషమున్నది. ఏకథ చెప్పినను బూర్తిగాఁ జెప్పఁజాలదు. సగము సగముగాఁ జెప్పును. ఒక శృంగారకథ సగము చెప్పినది. తరువాయి వినుటకు మా రాజపుత్రిక మిక్కిలి యుత్సకముఁ జెందుచున్నది. ఆ కథాశేషము మీ యొద్దనున్న పక్షికి వచ్చునఁట. అందులకై నన్నుఁ బ్రత్యేకము మీయొద్ద కనిపినది దీన నమ్మనక్కఱలేదు. మీకుఁ గోరినంత ధనము మీయొద్ద తాకట్టుగా నుంచుదము. ఈపక్షి నొక్కసారి నాచేతి కియ్యుఁడు. నేను దీసికొనిపోయి యా కథాశేషము చెప్పినతరువాత వెండియుం దీసికొనివత్తు నిదియే మా కోరిక. అని యుక్తియుక్తముగా నుపన్యసించిన విని రాజవాహనుఁడు చెల్లెలిమొగము జూచెను. అప్పు డా చిన్నది మీ రాజపుత్రిక కెట్టి సంకల్పమున్నదో మాకును నట్టియుత్సాహమే కలిగి యున్నది. ఈ ఖగపతికూడ మాకొక కథ సగముఁ జెప్పి తరువాయి కథ తనకు రాదనియు రెండవపిట్టకు వచ్చుననియుం జెప్పినది. ఆ కథాశేషము వినవలయునని మాకునుం జాల కుతురముగా నున్నది. తొలుత నీవాపక్షి నిక్కడికిఁ దీసికొనిరమ్ము. దానివలన శ్రోతవ్యముల వినినపిమ్మట దీనిని దీసికొని పోవుదువుగాక. ఆ పతంగ