పుట:కాశీమజిలీకథలు -09.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

గంధర్వులు — శ్లో. చిరేణహుత్వాప్యనవాప్త కామితం
                       ద్విజంగి రౌకుత్రచి దార్తచేత నం
                       కృతార్థయామానహే విక్రమోచిరా
                       దితీవా గంధర్వగణాస్తువంతి

ఒకానొక పర్వతమందొక బ్రాహ్మణుఁడొక దేవతను గురించి యొక కోరిక మీఁద జిరకాలమునుండి హోమము జేయుచున్నను నా దేవత ప్రత్యక్షమైనదికాదు. విక్రమార్కుఁడా వార్తవిని యందుజోయి యతని కామితము దీర్పకున్న నాదేవతకుఁ దన శిరము నఱికి బలియిచ్చుటకుఁ బ్రయత్నింపఁగా దేవత ప్రసన్నయై యావిప్రుని కోరికఁ దీర్చినది. వింటిరా ? ఈ మహాత్ముని సాహసమని గంధర్వులు పొగడినంతఁ గిన్నరు లిట్లనిరి.

కిన్నరులు – శ్లో. దత్తాని చత్వారి మహార్ణ వేన
                   రత్నానసౌ విక్రమ భూమిపాలః
                   మహీసుతాయ ప్రదదావితీమాం
                   కథాంవదంతిస్మహికిన్న రాస్తదా.

విక్రమార్కుండొక యాగమును దలపెట్టి చేయుచు సముద్రుని బిలుచుకొని రమ్మని యొక విప్రు నంపెను. అతండు వోయి సముద్రములోఁ బుష్పాంజలిఁ జల్లి విక్రమార్క సందేశ మెఱింగించినంత సముద్రుఁడు నాలుగు రత్నములు దెచ్చి వానికిచ్చుచు వీటిలో నొకటి ధనమిచ్చును. ఒకటి చోశ్యభోజ్యాది సకల పదార్థముల నిచ్చును. ఒకటి చతురంగ బలములు నిచ్చును. ఒకటి వస్త్రాద్యలంకారము లిచ్చునని యంపెను. విక్రమార్కుం డా రత్నములఁ జూచి వీనిలో నీ కిష్టమైన దానిం దీసికొనుమని చెప్పగా నా విప్రుం డింటికిఁ బోయివచ్చి మహారాజా ! నా కొడుకు చతురంగ బలము లిచ్చు దాని కోడలునగ లిచ్చుదాని భార్య భోజ్యపదార్థము లిచ్చుదానిం గోరిరి అవి మూడుఁను నాకు సమ్మతములుకావు. ధనమిచ్చుదానినే నా కిమ్మని కోరిన నవ్వుచు నాలుగు రత్నములు వానికే యిచ్చి సంతుష్టుం జేసెను. విక్రమార్కుని వంటి వదాన్య చక్రవర్తి యెవడున్నాఁడని కిన్నరులు నుతింపగా సిద్ధు లిట్లనిరి.

సిద్ధులు — శ్లో. ఇతఃపరం విక్రమభూమిపాల
                  స్తపశ్చరంతకిల వర్ణినం సః
                  పురేభిషిచ్య ప్రదదౌధనానీ
                  త్యెతాంకథాంతాం ప్రవదలతి సిద్ధాః ॥

ఒకనొక బ్రహ్మచారి తపము జేయుచుఁ దన చెంత కరుదెంచిన విక్రమార్కుని జూచి యాశీర్వదించి నీ కేమి కోరికయున్నదని యడుగఁగా బెండ్లియాడి రాజ్యము చేయవలయునని యభిలాష యున్నది, ఎట్లు తీరును అని కోరఁగా నందొక పట్టణము నిర్మింపఁజేసి చతురంగ బలములిచ్చి ధన ధాన్యములిచ్చి యా దేశమునకా