పుట:కాశీమజిలీకథలు -09.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐంద్రజాలికుని కథ

295

చంద్రునితో వెన్నెలయు మేఘముతో మెఱుపును భర్తతో భార్యయుఁ బోవునని చేసిన యచేతనములకుఁ గూడ తెలియును. భర్త మృతుండైనంత భార్య యగ్నినిఁ బ్రవేశింపజేసి యరుంధతి సమానురాలై స్వర్గలోకములోఁ బెద్దకాలము సుఖించును. భర్త దుర్మార్గుడైనను భార్య సహగమనము జేసెనేని తానేకాక భర్తను గూడఁ దరింపఁ జేయును. విధవ బ్రతుకుకన్న వ్యర్ధమైనది మఱియొకటి లేదుగదా మహాత్మా ! నాకు వేగ చితి రచింపఁజేయుము అగ్నిం బడియెదనని దీనయై వేడికొనియెను.

అప్పుడు విక్రమార్కుండేమి చేయుటకుం దోచక కన్నీరు గార్చుచుఁ దల్లీ ! నిన్ను నీ వల్లభున కర్పింపలేక పోయితిని. నీ మరణము చూడవలసి వచ్చినది. కఠినాత్ముడనై యెట్టు చూతునో తెలియదు. నీవు మహాపతివ్రతవు. నీమాట కడ్డు చెప్ప జాలము. శాస్త్రవిధికిఁ బ్రతికూలము సేయ నెవ్వరితరంబు, యని పలుకుచు మంచి గంధపు దారువులు దెప్పించి యా సభాప్రాంగణభాగంబుననే చితి రచింపఁజేసెను.

ఆ యువతియు సభ్యుల కెల్ల మ్రొక్కి భర్తయవయవములతో నగ్నికిఁ బ్రదక్షణముజేసి యాహుతాశనమునఁ బ్రవేశించి యెల్లరు జూచుచుండగనే భస్మమై పోయినది. విక్రమార్కుండు నాఁ డింటికింబోక భుజింపక యా దంపతుల గుఱించి విచారింపుచు సాయంకాలమువఱకు నా సభలోనే కూర్చుండెను. ఆరాత్రి నిద్రయుం బట్టినది కాదు. మఱునాఁడు సభలోఁ గూర్చుండి యతండా మాటలే చెప్పుచుండ -

గీ. అమ్మనేఁజెల్ల యెట్టిమాయాబలాఢ్యు
   లమరవైరులు వారిపీచము నడంప
   నాకకాకన్యులకు శక్యమా కడింది.
   నరులఁబరిమార్చి విజయమే నందుకొంటి.

అని పలుకుచు నమ్మహావీరుండు యథాపూర్వ వేషముతో ఖడ్గమొకచేతను మందారదామ మొకచేతను బూని నింగినుండి క్రిందికిదిగి విక్రమార్కుని నికటంబున నిలిచి నమస్కరింపుచు నిట్లనియె.

మహారాజా ! నే నిటనుండి నాకంబున కరుగువఱకు దేవదానవులకు మహా యుద్దము జరుగుచున్నది. అందు రక్కసు లుక్కు మిగిలి మాయాబలపాటవంబున నాకులఁ గాందిశీకులఁ గావించుటయు వేల్పులు వెన్నిచ్చి పారుట కుద్యమింపఁ బెంపుమై నే నందుకొని దేవతల నిలువరించి శత్రువుల కడ్డ కట్టనై యసిధారాపాతంబునఁగొందఱ నలుకియుఁ గొందఱం గొట్టియుఁ గొందఱ నేసియు రెండుగడియలతో దానవబ్బందంబులం జిందర వందర గావించి పారదోలితిని.

మత్కత్తృకంబగు విజయంబు విని మహేంద్రుఁడు సంతసించుచు మహావీరా బెద్దకాలమునకు గనంబడితివి. ఇంతదనుక నెందుంటివని యడిగిన నే నిట్లంటిని. దేవర శాపంబుననే నేను భూలోకమున వసించితిని. ఇప్పుడు దేవతలకు దానవులకు యుద్ధము పొసంగినదని విని యరుదెంచితిని. ఈ విజయమునకు దేవర