పుట:కాశీమజిలీకథలు -09.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమునిదేశయాత్ర కథ

291

నడ్డుపడి పోనిత్తుమా? అయ్యయ్యో ? వృదగా నెట్టి సుకృతి యాపద పాల్పడియెను? ఈ గ్రామమందున్న బ్రాహ్మణుల కేమియు వసతులు లేవు. ఇందలి భూమి పండదు. కడుపునిండ నన్నము లేక బాధపడుచున్నాము. ఎప్పుడో విక్రమార్కుని కడకుఁ బోయి మా బాధలు చెప్పుకొనవలయునని తలంచుకొను చుంటిమి. ఇఁక మా యాపద లెట్లు పోవును? యని యందలి బ్రాహ్మణులు దుఃఖింప వారించుచు నిట్లంటిని.

ఆ మహాత్మున కేమియు భయములేదు. చెక్కు చెదరక పుటము పెట్టిన బంగారమువలె మెఱయుచు సాయంకాలమున కిందు రాఁగలఁడు మీరా నృపతికి క్షేమకరముగా సూర్యనమస్కారములఁ గావింపుండుఁడని ప్రోత్సహించితిని. వా రత్యుత్సాహముతోఁ బెద్ద యెలుంగున నరుణస్తోత్రములు గావింపుచుండిరి సాయంకాలము వఱకు నందలి వారిలో నొక్కండైన నక్కడ కదలిపోలేదు. భుజింపలేదు. తదాగమనం బభిలషించి ధ్యానించుచుండిరి. అంతలోఁ బద్మినీకాంతుం డపరగిరితటనికటమున కరుగుటయు నాసువర్ణస్తంభంబు క్రమంబున హ్రస్వమై తటాకములోనికిఁ దిగుచుండెను. అప్పుడు.

క. పుటమిడిన పైడివలె వి
   స్ఫుటతరతేజమున మెలయుచును కంబము చ
   క్కటిఁ గూర్చున్న నృపుఁ జెం
   గటఁగని హర్షధ్వనుల్ గగనమంట జనుల్.

కరతాళములు వాయించుచు నతని వినుతింపుచుండ నమ్మహాత్ముఁ డాస్తంభాగ్రమునుండి తటాకాంతరమునందలి మంటపమునఁ దిగి వచ్చుచుండ నందలి బ్రాహ్మణసంఘంబులెల్ల మూఁగికొని జయవిక్రమార్క భూపా! యని యరచుచు నొకచో నిలువంబెట్టి యిట్లు విన్న వించుకొనిరి.

మహారాజా! నీవు విక్రమార్కుండవని యెఱుఁగక ప్రొద్దుట నుపేక్షగాఁ జూచితిమి. ఆమె వలన నీ వృత్తాంత మంతయుం దెలిసి కొంటిమి. ఈ గ్రామములో నూఱు బ్రాహ్మణ గృహంబులు గలవు. ఒక్కనికిఁ గడుపునిండ భోజనము కుదరదు. మేమందఱము మీకడ కరుదెంచి మాయిక్కట్టులఁ జెప్పుకొనవలయు నని తలంచుకొను చుంటిమి. పెరటిలోనికిఁ గల్పవృక్షము జేరినట్లు నీవే మాచెంగట కరుదెంచితివి. ఇఁక మా దరిద్రములు పటాపంచలై పోఁగలవు. సూర్యనిం జూచినఁ జీఁకటులు నిలుచునా? మహాత్మా ? మా యూరిలోనికి రమ్ము. భార్యాపుత్రులతో మేమెట్లు బాధపడుచుంటిమో చూడుము. అని దీనులై వేడుకొనఁగా నాలించి విక్రమార్కుడు చేతులెత్తి యిట్లనియె.

బ్రాహ్మణోత్తములారా! మీకు నమస్కారము నేను మీ దరిద్రము వినజాలను. ఇవిగో యీ రత్న కుండలములు రెండును మత్సాహసమునకు మెచ్చుకొని సూర్యుండు నాకుఁ గానుకగా నిచ్చెను. ఇవి నిత్యము రెండు బారువుల బంగార