పుట:కాశీమజిలీకథలు -09.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము


దర్పకుని కథ

అయ్యా! వినుండు. నాకాపురము వేణానదీతీరమున నొప్పు రత్నపురము. నేనొక ధనికుని కుమారుండ. నా పేరు దర్పకుండందురు నేనొకనాఁడు. సాయంకాలమున మా గ్రామ సమీపముననున్న వేణానదికిఁ బోయి కాలుజారి యందులోఁబడితిని. శరవేగముగా నా ప్రవాహము పోవుచుండెను. దైవికముగా నా చేతికొక దారువు దొరికినది. దానింబట్టికొని కొట్టుకొనిపోవుచుంటిని. రాత్రియెల్ల నా ప్రవాహవేగంబునం బోయితిని. యెంతదూర మేగితినో తెలియదు. అట్లుకొట్టుకొని పోయిపోయి యొకచోట మారువడిలోఁ బడి యొడ్డునకుఁ జేరియున్న చెట్లగుమిలోఁ దగులుకొంటిని. అప్పుడు తెలతెలవారు చుండెను.

అందతియొక చెట్టుకొమ్మ పట్టుకొని మెల్ల గా గట్టెక్కి నలుమూలలు పరికించి చూచితిని. ఆ ప్రదేశమంతయు మహారణ్యముగాఁ గనంబడినది. క్రూరసత్వముల యార్పులు వినంబడుచుండెను. ఆ భయంకరారణ్యములో నెటుపోవుటకుం దోచక తొట్రుపడుచు నొకమూలకుఁ గొంచెము దూరము నడచితిని. అల్ల తదవ్వులో నొక శూన్యచండికాయతనము నా కన్నులంబడినది. కంటకద్రుమాదుల నతిక్రమించి యెటకే నాగుడిలోనికిం బోయితిని. అందెవ్వరునులేరు. కర్తవ్యతామూఢుండనై యందటునిటు తిరుగుచుండ నింతలో బ్రొద్దు గ్రుంకినది. ఒంటిప్రాణముతో నాఁకలి వేధింప నా గుడిలో నొక మూలఁబండుకొని యుంటిని.

ఇంతలో యోగినులు గొందఱు భయంకరాకారములతో నాకాశమార్గమున నా యాలయములోనికి వచ్చి యొకమూల నున్న నన్నుం జూచి యట్టహాసముజేసి నీ వెవ్వడవు? మానివాసభూమి కెట్లు వచ్చితివి? అని యడిగిన లేచి గడగడలాడుచు జేతులు జోడించి నే నిట్లంటి. దేవతా చక్రవర్తినులారా? మీకు నమస్కారము. నేను మీ చరణంబుల శరణంబు వేడితిని. మీ శరణంబుజేరిన నన్ను రక్షింపక తీరదు. నేను వేదవేదాంగములఁ జదివిన బాహ్మణుని కుమారుండ. నాపేరు దర్పకుండందురు. కాలుజారి నదిలోఁబడి కొట్టుకొనివచ్చి యిందు గట్టెక్కితిని. మీరు నన్ను కాపాడకున్న నే నీయడవిలోఁబడి మడియవలసినదే యని పెద్దతడవు వారికి జాలిపుట్టునట్టు వేడుకొంటిని. వారికి నాపై ననుగ్రహము వచ్చినది. ఆరాత్రి నాకు గడుపునిండ భోజనము పెట్టరి. నూత్నాంబరాలంకారణాదులచే నలంకరింపఁ జేసిరి. ఆ రాత్రి సుఖముగా వెళ్ళినది.

మఱునాఁడు వారిలో వారిట్లు సంభాషించుకొనిరి. మనము నేఁడు చక్రపురంబునందలి యోగినీసభకుఁ బోవలసియున్నది. వీని నిందు విడిచిపోయితిమేని మృగంబుల పాలగును. మనము తిరుగ నెప్పుడు వత్తుమో తెలియదు. కావున వీని వెంటబెట్టుకొనిపోయి యెక్కడనో యునిచి తిరుగవచ్చునప్పుడు తీసికొని వతము. అని నిశ్చయించి యాయోగినులు నన్నరచేతిలోఁ బెట్టుకొని గగనమున