పుట:కాశీమజిలీకథలు -09.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేసటుని కథ

277

మిగుల చక్కనివాఁడని చెప్పి యతనికూఁతురు రూపవతి యను యువతిని బెండ్లి చేయుమని యడిగి మఱియు నిట్లంటి.

క. నగలెన్ని యేనిఁ బెట్టెడఁ
   దగువిభవముతోడ నిటకుఁ దరలి యరుగు దెం
   తుఁ గదమదున్నతిఁ బెండ్లిలి
   యగు వేళందెలియ జను లహాయని పొగడన్.

అని యనేక మాయవచనమ్ము లుపన్యసించి యావిప్రునిచేఁ దనపుత్రికను నా కుమారున కిచ్చునట్లొప్పించి తాంబూలములు బుచ్చికొంటిమి. ఆ వివాహమునకే మేమిప్పుడు పోవుచుంటిమి. నా కుమారుఁ జూచిన నాభూసురుండు బిల్లనీయఁడు. అందుల కేయుపాయము దోచక పరితపించుచుండ దైవికముగా నీ విందుఁ గనంబడితివి. ఇందులకు దైవము నిన్నాధారముగాఁ జూపెనని సంతసించు చుంటిని. వినుము. నీ రూపము మిగుల రమణీయముగా నున్నది.

నీవే నా కుమారుడవని చెప్పెదను. నేను వానితోఁ జెప్పిన దానికన్న నీ సౌందర్యము సుత్యముగా నున్నది. నీవా వివాహవేదిక పైఁ గూర్చుండి పాణిగ్రహణవిధి నెరావేర్పుము. మా యింటికి వచ్చిన తరువాత నానాతిని నా కుమారున కిచ్చి వేయవలయును. ఇదియే నీవు నాకుఁ జేయవలసిన యపకారము, ఇందు నీకు వచ్చిన కొదవయేమి యున్నది? పెండ్లి యైదుదినములు విందు ఆరగింపుచు నుత్సవము లందవచ్చునని రాడిగిన విని నే నంగీకరించితిని.

నన్నుఁ దమయోడమీదఁ నెక్కించుకొని యావిప్రుండు నర్మదానదిని దాటి యవ్వలియొడ్డున దిగి బంధుజనముతోఁ గూడ నాటి సాయంకాలమున కొక పల్లెటూరు చేరెను. అందొక విప్రగృహంబున వంటఁజేసికొని భుజించితిమి. నేనా రాత్రిఁ గటికచీకటిలో దేహబాధకై యెఱుఁగక చెఱువుగట్టు ప్రక్కనున్న డుద్ర భూమిలోనికిం బోయితిని.

అందొక బ్రహ్మరాక్షసుఁడు నన్నుఁ జూచి జడిపించుచు నోరు తెరచుకొని నాకడ కరుదెంచి మ్రింగుటకుఁ బ్రయత్నింపఁగా నేను జేతులు జోడించి యిట్లంటి మహాత్మా! యీ శరీర మెప్పటికైన నశించునదియే. వృధాగాఁ గాక గృధ్రములపాలు గాక మీవంటి వారి కుపచరింపఁ జేయుట మహాపుణ్యముగదా. అందుల కించుకయు నేను పరితపింపను. కాని నేనొక బ్రాహ్మణుని కుపకారము చేయుదు నని ప్రతిజ్ఞఁ బట్టితిని. నా మరణము వలన నతని కుపకారము జరుగదు. ఇత్తునన్న యర్ద మీయక పోవుటకంటె దారుణమైన పాపము మఱియొకటి లేదు. ఈ విషయమై నీవు నాకొక యుపకారము జేయవలసి యున్నది వినుము. నన్నిప్పుడు వదలుము బ్రాహ్మణకార్యము జక్కబెట్టి యైదవనాఁడు రాత్రి నీకడ కరుదెంచెద నప్పుడు నన్ను భక్షించి నీయాఁకలి యడంచుకొనుము. నీకుఁ జాల పుణ్యము రాఁగల దని యుక్తియుక్తముగా