పుట:కాశీమజిలీకథలు -09.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(35)

బ్రాహ్మణ కుటుంబము కథ

273

త్నించుచునే యుంటిమి తులమెత్తుబంగారము మా యిల్లంతయు వెదకినను దొరకదు. పిల్ల యెదిగినకొలది బంగార మెక్కువ కావలసివచ్చును. వివాహకాలముగూడ నతిక్రమించు చున్నది. పెండ్లిచేయకున్నఁ గులములో వెలివేయుదురు. ఆడినమాట తప్పుటకంటె మహాపాతకములేదు. ఏమిచేయుటకుం దోచక పరితపించుచుండ నొక మిత్రుం డీ యుపాయము చెప్పెను.

గీ. విక్రమార్కుండునా కల్పవృక్షమవని
    నర్దిజనకోటి కోరు కామ్యములఁ దీర్చు
    చుండ మీరిట్టు చింతించు చుంటిరేల?
    పొండు మీరమ్మహారాజు పొంతకిపుఁడు.

అతని మాట విని అయ్యుదారుం డీకన్యాదానము గావించునని తలచి దూరమైనను గష్టములకోర్చి యీ కన్యకను వెంటఁబెట్టికొని యందుఁ బోవుచున్నారమని యా బ్రాహ్మణుఁడు తన వృత్తాంత మంతయుం జెప్పెను.

అతని చరిత్రము విని విక్రమార్కుండు చిఱునవ్వు నవ్వి విప్రోత్తమా? మీరు పెద్ద లంతదూరము పోలేరేమో? ఇందులకు నాకు దోచిన సహాయము గావించెద వినుండు. నాకడ రసము రసాయనము అను రెండువస్తువులు మాత్రమున్నవి. రసమనుభవించిన వృద్ధత్వము వోయి పూర్ణయౌవనముతో నొప్పుచుఁ జిరకాలము జీవించును. రసాయనము వలన నితర లోహముల బంగారము జేసికొని యైశ్వర్యమనుభవింపవచ్చును. ఈ రెండు వస్తువులలో మీకొకటి యిచ్చెద మీకేది కావలయునో యాలోచించుకొని జెప్పుఁడని పలికిన సంతసించుచు నా వృద్ధుండు కుమారునితోఁ గూడఁ గొంచె మవ్వలికిఁ బోయి యిట్లాలోచించెను.

తండ్రి - అబ్బాయీ! యీతఁ డెవ్వఁడో తపస్సిద్ధుఁ డగు వదాన్యుఁడు వలె దోచుచున్నాఁడు. కానిచో నట్టి వస్తువు మన కిత్తుననునా? వీనిలో నేది కోరు మందువు. ఆలోచించి చెప్పుము.

కుమారుడు — ఆలోచించుట కేమి యున్నది. రసాయనమే కోరుదము ఇప్పు డీదుర్గ యెత్తు బంగారమే గాక కావలసినంత బంగారము జేసికొనవచ్చును. మహారాజైన మనకుఁ జాలఁడు. ఈతం డమాయకుఁడువలె నున్నాఁడు. అట్టి వస్తు వెవ్వఁడైన నిచ్చునా?

తండ్రి --- అబ్బాయి: నేనొక మాటఁ జెప్పెద. గోపింపకేమి. నేనీ వార్ధక్యము భరింప లేకున్నాను. యౌవనచర్యలన్నియుఁ దలంచుకొని దుఃఖించుచుందును. యారసమే కోరవలయునని యున్నది. ఏమందువు ?

కుమా-- బాగు బాగు. సిగ్గులేక మాట్లాడెదవేల తిరిగి యౌవనము వచ్చిన తిరుగ సంతానముఁ గందువు గాక. అందరము గలసి చిప్పలు వాసి నీ పేరుగా ముష్టి యెత్తుకొనియెదము. వివేకము లేకున్న నెంతచదివిన నేమి ?