పుట:కాశీమజిలీకథలు -09.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    కటికచీఁకటి వల్లకాట భీతిలక బం
                  ధించి భేతాళునిఁ దెచ్చినావు
    జంపఁబూనిన దుష్టసన్యాసి బలియిచ్చి
                  భేతాళు బంటుఁ గావించినావు
    హరిహరాదులకు శక్యము గాని పనియై
                 కాపాలికుని మచ్చ మాపినావు
గీ. కరుణ వెలయఁగ మదనమంజరి భర్త
    తోడఁ గూఁడఁజేసి తార్తులను బ్రోచి
    తరులఁ బరిమార్చితివి దేశయాత్రఁజేసి
    నన్నుఁబొగడఁగ మాకగునే నరేంద్ర 1

మఱియు

సీ. కవచకుండలము లొక్కటి మాత్రమే యిచ్చి
                కర్ణుండు లోక విఖ్యాతుఁడయ్యె
    మృతికిఁ గాల్సాపిన యతివృద్దుఁడు దధీచి
               యెముక నిచ్చి సుకీర్తి వెసఁగె
    వెలగపండంత క్రొవ్విన మేనిమాంస మీ
               బూని యాశిబి పేరుఁబొందె నవని
    నడిగినఁ పుడమి మూఁడడుగులు హరికిచ్చి

అని చదివి మాగధులు పైనఁ జదువుటకు సందియ మందుచుండ నెఱింగి బలి చదువుఁడు అని పరులాడిన మాటలు మీకేల అని యజ్ఞాపించుటయు

               ధారుణి బలి పెద్దపేరువడ సె
గీ. కలదె వారికి నిట్టివిక్రమమునిట్టి
   సాహసం బీ విగ్దత శాంతభావ
   మీయుధారత కొంచెమయేని పుణ్య
   వశమునను దాతలని పేరువచ్చెఁగాని.

అని మఱియుఁ బెద్దగాఁ స్తోత్రపాఠములు చదువుచుండ విక్రమార్కుండు వారించుచు దానవేంద్రా! జగద్రక్షకుని బ్రత్యక్షముగా గాంచి సకలైశ్వర్యములు నర్పించిన మహానుభావుండవు. నీకడనా నా యుదారత వర్ణించుట ? చాలు చాలు. సిగ్గు సిగ్గు అని చెవులు మూసికొనియెను. అప్పుడు బలిచక్రవర్తి యతని భుజము గొట్టుచు బాబూ ? నీ కిన్ని సుగుణంబు లెట్లు కలిగినవి ? నీ గుణపాఠములు విని విని యానదించి నిన్నుఁ జూడవయునని తలంచి వరాహకైతవమున విన్నిందు రప్పించితి తండ్రి ! నీ కేదేని యభీష్టమున్నఁ జెప్పుము. తీర్చెదనని యడిగిన నతం డిట్లనియె.