పుట:కాశీమజిలీకథలు -09.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలిచక్రవర్తి కథ

269

    సకలసంపద లశాశ్వతములంచుఁ దలంచి
                   రాజ్యమేలిన సువిరక్తమతివి
    ప్రత్యక్షముగ విష్ణుపాణిఁగోరినభూమి
                  ధారవోసిన మహోదారయశుఁడ
గీ. వచ్యుతపదాబ్జరేణుపూతామలప్ర
   శస్తమస్తకుఁడవు నీకు సాటియే మ
   హేంద్రుఁ డైనను సాధు మునీంద్రులైన
   నతులకీర్తిపవిత్ర! ప్రహ్లాదపౌత్ర!

క. నీదర్శన మొనరించితి
   నే ధన్యుడ నైతిఁగద ననేకజననసం
   పాదితసుకృతవిశేషము
   చే దానవనాథ! పూతచిత్తుఁడ నైతిన్.

ఆహా! నా భాగ్యమేమని చెప్పికొందును? మానుషదర్శనదుర్గ భుఁడవగు నిన్నుఁ బ్రత్యక్షముగాఁ గనుఁగొంటి. నావంటి కృతార్థు డెందును లేఁడని పొగడుకొనుచుండ నతనిని గౌఁగలించుకొని యుపలాలించుచుఁ బాణిఁ బాణిం గీలించి నిజపీఠాగ్రంబునకుం దీసికొనిపోయి యర్ధసింహాసనంబునఁ గూర్చుండబెట్టి గారవించుచు నిట్లనియెను.

వత్సా! విక్రమార్క సంతతము భవదీయ సాహసవితరణాది సుగుణ పుంజంబుల దేవతా విశేషులు వినుతింపుచుండ శ్రోత్రానందముగా నాలింపుచుంటి దేవలోకముల నన్నిట నీ పేరు మ్రోగుచున్నదఁట ఇదివఱకు జనించిన భూపతులలో నీయంతవాఁడు లేడనుట సత్యము. ఒక్కొక్కని కొక్కొక్క సుగుణమువలనఁ బ్రఖ్యాతి కలిగినది. కాని నీవలె నిన్నిగుణంబు లెవ్వనియందున్నవి ? ఆహా! నీ సుగణంబులు వైతాళికులు వినుతింపుచుండ మేను గఱపు జెందుచుండును. మొన్న నాకములో భవత్కీర్తి ప్రఖ్యాతమగు నాటక మాడిరఁట.

అందు నిన్నుఁ గుఱించి చేసిన స్తుతిపాఠము లన్నియు మా వైతాళికులు పాఠము జేసికొనివచ్చిరి. నీవును విందువుగాక అని పలుకుచు నా పద్యములం జదువు మని మాగధుల కాజ్ఞాపించెను. అప్పుడు వాంద్రిట్లు చదివిరి.

క. జయవిక్రమార్క భూపా!
   జయ నిర్వాసిత మహాసుజన సంతాపా !
   జయ మనసిజరూప ! ద్విష
   ద్భయదాధిక సుప్రతాప ! ప్రధితాలాపా !

సీ. ఉట్టిచేరులు నైదు నొక్కటనసిఁ గోసి
                  వానిచే వరములఁగాంచి నావు