పుట:కాశీమజిలీకథలు -09.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మానదుగదా ? తటస్థుండువోలెఁ జూచుచుండెదనని యాలోచించుచు నటఁ గదలి వెండియు రాజమార్గంబునంబడి నడువసాగెను.

నాటకము జూచుటకై నాటకమున కరిగి వచ్చి నాగు లెల్లరు తమతమ గృహములలో నాత్మీయ సాహస వితరణాది గుణగణంబు లగ్గింపుచుండ నాలించుచు నమ్మహారాజు బోయి యెట్టకే బలిచక్రవర్తిగారి పశ్చిమ సింహద్వారము చేరెను. అందు దురాసిదామ విభూషితోదరులు శీదివమాల్యానులేప నాలంకృతాంగులు శంఖచక్రగదాది సాధనహస్తులు నూర్ద్వపుండ్రాంకిత ఫాలురునగు మహాపురుషులు వేనవేలు గాచుకొని యుండిరి. వారికి మ్రొక్కుచు నా నృపతి యందలి గోపుర ప్రాకార మంటపాది గృహ విశేషములఁ జూచి యాశ్చర్య సాగరంబున మునింగి మహాత్ములారా ! నేనొక మానవుఁడ. పరమభాగవత శిఖామణియగు బలిదానవేంద్రునిం జూడ వేడుకపడి వచ్చితిని. వారి దర్శనము సేయింతురేయని ప్రార్థించిన నతనిమాట లెవ్వరు వినిపించుకొనరైరి. అతండు పలుమారట్లె యడుగుచుండ నందొక వీరభటు డతని దెసజూచి నీ వెవ్వఁడవు ? విక్రమార్కుండవైతేని లోనికిఁ దీసికొనిపోయెడిఁ గానిచో నవ్వలఁ బొమ్మని పలికిన విని యతండు తెల్లపోయి యిట్లనియె.

స్వామీ ! నీవనినమాట నాకు దెలిసినదికాదు. ఇప్పుడు మీరు విక్రమార్కుని పేరుచ్చరింప బ్రయోజన మేమి వచ్చినది. అతం డిందు వచ్చుననుకొను చుంటిరా యేమి ? అని యడుగుటయు నా భటుండదేమియో నాకు దెలియదు. నాకట్టి యాజ్ఞ యున్నదని యుత్తర మిచ్చెను.

పోనిండు. మీ వాక్యమున కన్యధాత్వమేల రావలయును నేను విక్రమార్కుండనే వారి దర్శనము జేయింపుఁడని వేడికొనియెను. అతం డా నరపతి కరము పట్టుకొని క్రమంబున సప్తకక్ష్యాంతరంబులు దాటించి బలిచక్రవర్తి పీఠము దాపున విడిచి యవ్వలికిఁ బోయెను. అప్పుడు

క. కాంచన బలి సింహాసన
   చచంన్నవరత్నకిరణసముదయము తటి
   త్సంచయమన మెరయఁగ ముకు
   ళించుచుఁ గనుదోయి పతి చలింపని కడకన్.

ఇటునటు పరికింపుచున్న సమయంబున నబ్బలిచక్రవర్తి పీఠ నికటంబున విక్రమార్క నృపచంద్రుం గాంచి తటాలున లేచి గద్దియ దిగివచ్చి యతిని గ్రుచ్చి యెత్తుటయు నమ్మహారాజు తత్పాదపద్మములకు సాష్టాంగనమస్కారము గావింపుచు.

సీ. అఖిలార్ధఘాతుకంబగు నాపద ఘటించు
                 నని యెఱింగియు నొసంగిన సుదాత
    వఖిలవేదోండ నాయకుఁ బరాత్పరు విష్ణు
                గనులారఁ దృప్తిఁగాంచిన సుకృతివి