పుట:కాశీమజిలీకథలు -09.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలిచక్రవర్తి కథ

267

కొనినఁ జాలదా ? వాని వైదగ్ద్యము నీవే మెఱుంగుదువు ? అతండు దక్షిణ నాయకుండు.

రత్న - దక్షిణ నాయకుఁడో పశ్చిమనాయకుఁడో నే నెఱుఁగను. నీవు వాసుకి మనుమరాలవు. అతండొక మనుష్యుఁడు. మహాకులీనుండగు గాక వేల్పులు మానవుల వరింపఁదగదు.

మణి - మొన్నటి నాటకములో నెందఱు దేవకన్యక లతని వరించి విరహాతురలై పరితపించుచుండిరో చూచితివా ? కులము తక్కువవాని వారేల వరించిరి.

రత్న - సరి సరి. అది నాటకము. అందలి విషయము కల్పితములు, సత్యములు కావు.

మణి – నీవు వట్టి మూర్ఖురాలవు. నీ కేమియుం దెలియదు. మదనమంజరి నిజమైన విషయములనే నాటకమాడి ప్రదర్శించినది. ఆమె కామహానుభావునం దట్టి భక్తి విశ్వాసము లున్నవి. హరిహరాదులచే జేయ శక్యముకాని యుపకార మతఁ డామెకుఁ గావించెనఁట.

రత్న - నన్నిప్పుడేమి చేయుమందువు ?

మణి – మా తలిదండ్రులకు నా యభిప్రాయము జెప్పి యా భూలోక రత్నమునకుఁ బెండ్లిఁజేయుమని వారికిఁ దెలుపుము.

రత్న - వారంగీకరింపరని నా తలంపు.

మణి — నేను త్రికరణములచేత విక్రమార్క మహారాజును బతిగా వరించితిని. అతఁడే నా భర్త. తదన్యు నేనంగీకరింపను. వారొప్పుకొననిచో నాకు మరణమే శరణము.

అని వారు సంభాషించుకొనుచు విహారములు చాలించి తమ నెలవునకుం బోయిరి. ఆ మాటలన్నియు మాటునుండి విని విక్రమార్కుండోహో ! మదనమంజరి నేను జేసిన యుపకారము కొంచెమైనను గొప్పజేసికొని నా పేరు దేవలోకము లన్నియు వ్యాపకము జేయుచున్నది. ఆమె కృతజ్ఞత స్తోత్రపాత్రమైనది. ఆమె యాడించిన నాటకముజూచి మహేంద్రునకు నన్నుఁ జూడవలయునని తలంపు గలిగి యున్నదని వారిమాటలచేఁ దెలియబడుచున్నది. ఈ వార్తవిని నాకు సిగ్గగుచున్నది. నే నెక్కడ మహేంద్రుఁ డెక్కడ ? వారి పాదరజంబునకైన నన్ను మఱియు నీ వాసుకి మనుమరాలు మదనమంజరి స్తోత్రపాఠములు విని నన్ను వరించుటకు నిశ్చ యించుకొన్నది. ఇదియ సాదృశ్యబాంధవ్యంబు రత్నపదిక జెప్పినట్లు వేల్పులు మనుషులకన్న నుత్తములు. వారితో క్షణయౌవనులగు మనుజులకు సంబంధ బాంధవ్యములు కర్తవర్గములు కావు. కానిమ్ము భవితవ్యత యెట్లుడుంనో యట్లు జరుగక