పుట:కాశీమజిలీకథలు -09.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(34)

బలిచక్రవర్తి కథ

265

శూర్పణఖ సీతవేషము వహించి శ్రీరాము నెత్తుకొనిపోయి విక్రీడింప వేలయునని తలంచి యొకమూల నట్టివేషముతోఁ గాచికొని యుండెను.

అప్పుడా ప్రాంతమందు దిరుగుచున్న విరాధుఁడు సీతావేషముతో దూరదూరముగాఁ దిరిగుచున్న శూర్పణఖం జూచి సీత యనుకొని దాపునకు జేరి సీతా! రారమ్ము. ఈ వనములోఁ గ్రొత్తవిశేషము లున్నవి. చూతము గాక అని పలుకుచుండ నదియు సంతసించుచు దూరదూరముగా వాని వెంటఁ బోయినది. కొంతదూరము బోయిన తరువాత సందుఁ జూచి వాఁడా సుందరిని గౌఁగిటఁ జిక్క బట్టి యెత్తుకొని పారిపోవుచుండ శూర్పణఖ పర్వతమువలె బరువగుటయు వాఁడు మోయలేక నిదానించి చూచి అయ్యో? శూర్పణఖవలె నున్నదే అని పలుకుచు గుభాలున నేలబడ వైచెను. ఇరువురు నిజరూపము వహించిరి. అయ్యో! నీవా? అనియు నీవా? అనియు తెల తెల్లఁ బోయి చూచుచుండిరి.

వారి కపటప్రచారములు చూచి సభ్యులు కడుపు లుబ్బులాగున నవ్విరి! ఈలాటి వింత లనేకము లానాటకమునంగలవు. అంతయు రాక్షసమాయచర్యలతో నిండింపఁబడి యున్నది.

అని యెఱింగింప విని యురగుఁడు ఆ నాటకమున కెవ్వ రెవ్వరు వచ్చిరని యడిగిన భార్య లిట్లనిరి.

ప్రాణేశ్వరా? అష్టదిక్పతులు, ముప్పది మూఁడుకోటుల వేల్పులు గరుడ గంధర్వ కిన్నర యక్ష రాక్షసాది దేవతావిశేషులెల్లవచ్చి వచ్చి సభ నలంకరించిరి. మఱియు నలకాపురమునుండి కుబేరుని మరదలు మదనమంజరి యనునది పెక్కండ్ర యక్షకాంతల వెంటబెట్టుకొని వచ్చి యా నాటకమునఁ పెక్కు భూమికలకు సహాయము గావించినది.

మఱియు నామె యీ నాటక మాడిన మరునాఁడే త్రిపురసుందరీ విక్రమార్కమను నాటకము దా రచించినది యందు బ్రదర్శింపఁ జేసినది. అందు మేము గొన్ని భూమికల వహింపవలసి వచ్చినది. ఆహా ! ఆ నాటకమున విక్రమార్క మహారాజు సాహసవితరణాది సుగుణ గణంబులు విచిత్రముగా వర్ణింపబడినవి. అమ్మహారాజుం జూడ వేల్పులందఱు వేడుకపడుచున్నారు. త్రిపురసుందరి ఆమెకక్క కూఁతురట ఆ నృపతి రెండవ భార్యగాఁ జేయునట. గంధర్వాది దేవతలు తమ తమ కన్యకల నతనికి వివాహము జేయఁ బ్రయత్నించుచున్నారు. అతని కీర్తి ప్రతాపసౌందర్య చాతుర్యాదులు విని దేవకన్యకలు మన్మథార్తిం బొందుచున్నారు. రెండవ నాటకమున మేము వేషములువైచుటచే నన్న దివసంబునను రాలేకపోయితిమని యచ్చటి వృత్తాంతమంతయుం జెప్పిరి. అయ్యుదంతము విని యురఁగుడు ఔను విక్రమార్కమహారాజు కీర్తి పాతాళమునగూడ వ్యాపించినది.

నాగకన్యకలు గానము సేయుచుండ నాలించితి. వాసుకి మునిమనుమరాలు