పుట:కాశీమజిలీకథలు -09.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచ్చరల కథ

31

అని యాక్షేపించినఁ దిలోత్తమ నవ్వుచు వారి ముఖవిలాస ముపలక్షించియే యడిగితిని. నే నామాత్ర మెఱుఁగనా? అని సమాధానముఁ జెప్పినది.

తరువాత వారిలోఁ గొందఱు యిఁక నీ సంవాదము చాలింపుడు. ఇంద్రునికిఁ దెలిసిన శిక్షించు ననిరి. మఱికొంద రది కాదు. నారదమహర్షి వచనప్రకారము దప్పక పక్షుల నడగవలసినదే అని పట్టుపట్టిరి. ఆ వాదమే నిలఁబడినది. అప్పుడు వారందఱు నందనవనమంతయుఁ దిరిగి కల్పవృక్షములఁ బరిశీలించి యా శకుంతమిధునమును గనుఁగొనిరి.

ఓ పారావతశకుంతమాలారా! మీకు నమస్కారము. మీరు ప్రాజ్ఞులని నారదమహర్షి చెప్పిపోయెను. మాలో మాకొకవిషయమై తగవు వచ్చినది. హెచ్చు కుందులు మీరు సెప్పవలసియున్నది. వినుండు. దేవలోకములో సుప్రసిద్ధ సౌందర్యశాలలు చంద్రుడు, వసంతుడు, కంతుఁడు, జయంతుఁడు, నలకూబరుండునుగదా! వారిలోఁ జంద్రుఁడు గ్రహము. కంతునకు రూపము లేదు. వసంతుఁడు వృక్షసంక్రాంతుడు. కావున వారు మువ్వురు లెక్కలోనివారుకారు. జయంతుఁడు నలకూబరుఁడు సంపదచేతఁ బ్రభుత్వముచేత వయసుచేతం బొగడఁదగి యున్నవారు. శృంగారలీలానుభవము సౌందర్యము కళావిదగ్ధత వారిద్దరిలో నెవ్వరియం దెక్కువగా నున్నదో చెప్పవలసియున్నది. కొంద రతఁ డనియుఁ గొంద రితఁ డనియు వాదించుచున్నారు. మీ మాటలు శ్రుతివాక్యముగా మన్నింతుము. తారతమ్యముల విచారించి వక్కాణింపుఁడని ప్రార్థించిన నప్పతంగపుంగవము లిట్లనియె.

ఆహా! మీరు దేవకాంతలు. శృంగారలీలాచాతుర్యాదివిశేషముల లెస్సగ నెఱిఁగినవారు. అనుభవైకవేద్యమగు వారివిదగ్ధత మా కెట్లు తెలియును? అయినను నారదమహర్షి యా భారము మాపైఁ బెట్టెను. కావున వారియానతి కన్యధాత్వ మాపాదింపఁగూడదు. ఆ సుందరు లిద్దరు, భార్యలతో నచ్చరలతో నీ వనములోఁ గ్రీడించుచుండ బెక్కుసారులు చూచితిమి కాని పరీక్షింపలేదు. ఇందులకు రెండు మాసములు గడువీయుఁడు. అందలి తత్వంబుఁ దెలిసికొని వక్కాణింతుమని పలికిన సంతసింపుచు నానిలింపకాంతలు తమనెలవులకుఁ బోయిరి.

అని యెఱింగించి యా పక్షీంద్రము మౌనముద్ర వహించుటయుఁ గల్పలత హృదయలత పల్లవింప నిట్లనియె శకుంతమా! మీ జాతియందెట్టి గౌరవ మున్నదియో చూచితిరా! నారదుఁ డంతటివాఁడు పారావతముల నడుగుమని యానతిచ్చెను. ఆ పక్షు లెంత తెలిసినవియో అని స్తుతియించుచు. నీవు చెప్పినకథ చాల బాగున్నది. తరువాతి వృత్తాంతము వినుడనుట తోచుటలేదు. కావున వేగ మవ్వలికథఁ జెప్పుము. వారిలో నెవ్వఁడధికుఁడని చెప్పినవియో వినవలయునని కుతూహలముగా నున్నది. ఎరింగింపుమని యడిగిన నప్పక్షిప్రవరంబు అయ్యో కల్పలతా! నే నేమిచేయుదును. నీ కీకథ చెప్పకపోయినను బాగుండును. నా కీకథ ఇంతవఱకే