పుట:కాశీమజిలీకథలు -09.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కేశ – శ్లో. అధ్రువేణ శరీరేణ ప్రతిక్షణ వినాశినా
           ధ్రువంయోనార్జయేద్ధర్మం సవోచ్యో మూఢచేతనః

ఎవ్వనికిని ముందరి క్షణ మెట్లుండునో తెలియదుగదా? అట్టి యశాశ్వతమైన దేహముచేత శాశ్వతమై యొప్పుచుండు ధర్మ మెవ్వఁడార్జింపఁడో యంతకన్న మూఢుండు పశుపు పాలసుం డింకొకఁడున్నాఁడా?

మాధవా - స్వామీ ! మీరు చెప్పినవి యమృతఘుటికలు గదా తరువాత..

కేశ —శ్లో. హోమధేను ధనాదీనాం దాతారః సులభాభువి
           దుర్లభః పురుషోలోకే సర్వజీవదయాపరః

ధనకనక వస్తువాహనాదులు దానమిచ్చు దాతలు పెక్కండ్రుగలరు. కాని సర్వజీవములసమముగా జూచి యానందించువాఁడుండుట యరుదు. అట్టివాఁడు భూలోకములో విక్రమార్కుండను మహారాజున్నాఁడని చెప్పుదురు. కామక్రోధాదుల హృదయంబున నిరూఢములై యుండ నట్టి గుణంబు లెట్లు కలుగును.

మాధవాచార్యులు :- నిత్యము బరోపకారమునకై ప్రయత్నము చేయు చుండవలయును. దేహమును నిర్లక్ష్యముగాఁ జూచి సాహసకార్యములు చేయుచుండ వలయును. చావునకు వెఱవఁకూడదు. ఆచార్యులుగారూ! మీరు నమ్ముదురో లేదో కాని నేనిప్పు డట్టి ప్రయత్నమే చేయుచుంటిని అని చెప్పుచుండఁగనే యాప్రాంతము నుండి యొక వృద్ధ బ్రాహ్మణుఁ డరుదెంచి మహాత్ములారా! పుణ్యాత్ములారా! రక్షింపుడు. రక్షింపుడు. మొసళ్ళున్న వని యెఱుంగక మేమీ పుణ్యసరస్సులో స్నానము చేసితిమి. నా భార్య నొక మొసలి లాగికొని పోవుచున్నది. మీలోఁ బుణ్యపురుషుఁ డెవ్వఁడైన వచ్చి రక్షింపరే యని యాక్రోశించెను.

అప్పుడావైష్ణవు లెల్ల లేచి అయ్యో ! ఈ స్వామికిఁ దెలియక యాసరస్సునకే పోయెనా? అందుఁ గ్రుంకినవాఁడు బ్రదుకుట కష్టమే. మొసళ్ళు చాలఁ గలవు. ఇతరులు బోవుటకష్టమే అని పలుకుచుఁ దటాకము చుట్టును నిలువబడి చూచుచుండిరి.

అప్పుడు పురాణము చెప్పుచున్న కేశవాచార్యులు మాధవాచార్యులుగారితో స్వామీ! సమయము వచ్చినది. మనము చదివిన విషయములు యథార్థము దెలియుటకే యీ బ్రాహ్మణుఁ డిట్లు వచ్చెనేమో యెట్లయిన నేమి? మీరు సాధనము చేయుచున్నారు గదా దుముకుఁడు కొలనిలో దుముకుఁడని ప్రోత్సహించుటయు నతండిట్లనియె.

స్వామీ? శరీర మాద్యం ఖలు ధర్మసాధన మని చెప్పియున్నారుగదా? ఈ కోనేరులోఁ దిగినవాడు తిరుగా బ్రతుకుననుమాట కల్ల. ఆమెను బట్టికొని తీసికొన రాలేకబోవుటయేగాక వృధాగాఁ జావవలసి వచ్చును. ఇట్టి దారుణక్రియ ధర్మశాస్త్రసమ్మతమని నేనంగీకరింపను. ఆమె కాయువు మూఁడియే యందు మునిఁగినది (బుద్ధిః కర్మానుసారిణీ) అను మాటయేల తప్పును. దైవలిఖితముల మనము మార్చగలమా? ఆమె ప్రారబ్ధ మట్లున్నది. మనమేమి చేయఁగలము, ఆమెకు జలగండము విధి