పుట:కాశీమజిలీకథలు -09.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభావతి కథ

253

మహారాజా! ఈ మహానుభావుఁ డెవ్వఁడో మే మెఱుంగము. మే ముజ్జయినికిఁ బోవుచుండ దారిలో నెదురుపడి మే మడిగిన విక్రమార్కుం డూరలేఁడని చెప్పెను. మే మందులకు వగచుచుండ మమ్మోదార్చి యోపిన సహాయము జేయుదునని తీసికొనివచ్చెను. దాహమిచ్చిన వృద్ధ భూసురునకు దా నెక్కివచ్చిన గుర్రమునిచ్చి యందు పై నెక్కించి కళ్ళెము పట్టుకొని నడిపించుచు నీ యూరు దీసికుని వచ్చెను. గుర్రమును బదివేలకీ బేహారి కమ్మిన మాట వాస్తవము నెలలోపున సహస్రపరిమితంబగు కుశీదముతో నా సొమ్మినచోఁ దిరుగా గుర్రమిచ్చున ట్లొడంబడిక వ్రాయించి పుచ్చుకొంటిమి. ఇదిగో చూడుఁడు. గుర్రపుపందెముల వార్తవిని యుబ్బుచు బేహారి కీయవలసిన సొమ్మునకై మృత్యుముఖంబని యెల్లరు చెప్పుచుండ లక్ష్యము సేయక బోగముదాని యింటికిం బోయి దాని నంటియున్న బ్రహ్మరాక్షసునిం గడతేర్చి యా సొమ్ము దెచ్చి యిచ్చి గుర్రమీమన్న నీ దుర్మార్గుఁ డీయక తగవు పెట్టెను.

క్షణము దాటిన పందెములవేళ మిగిలిపోవును. అప్పుడు బుద్ధిమంతుఁ డిత డాలోచించి వాని కపటము దెలిసికొని యా గుర్రపుసాలకుఁ బోయి పిల్చినంతఁ గట్టులఁ ద్రెంపుకొని యా హయం బతిరయంబున వచ్చి యతనిచెంత నిలిచినది. దాని నెక్కి రెండు పందెములును గెలిచెను. బేహారి కీయవలసిన రొక్కము తక్క తక్కిన సొమ్మంతయు మా యజ్ఞమున కర్పించి చీటినిచ్చెను. గవ్వయైన దానందు ముట్టఁ డయ్యె. నిట్టి వదాన్యచక్రవర్తి యెందున్న వాఁడని చెప్పి మరియు -

సీ. కవచకుండలము లొక్కటి మాత్రమే యిచ్చి
              కర్ణుండులోక విఖ్యాతిఁగాంచె
    మృతికిఁ గాల్సాపిన యతివృద్ధుఁడు దధీచి
              యెముక నిచ్చి సుకీర్తి నెసఁక మెసఁగెఁ
    గడిగి మూఁడడుగుల పుడమి శ్రీపతికిచ్చి
              పేర్మిమై బలి పెద్దపేరు వడసె
    వెలగపండంత క్రొవ్విన మేని మాంస మీ
              బూని యాశిబి యశఃపూర్ణుండయ్యె
గీ. కలదె వారల కీ వివేక ప్రశాంత
    మీయుదారత యీశౌర్య మీప్రభావ
    మిట్టి సాహస మీధైర్య మీరక్తి
    వసుధఁ దొలిపుణ్యమున పేరు వచ్చెఁగాని.

అని స్తుతియింపుచు నా వృత్తాంత మెఱింగించుటయు నా నృపాలుండు దదీయౌదార్యమున కాశ్చర్యమందుచుఁ బరాక్రమము నభినందిచుచుఁ బెద్దగా గౌరవించెను కాని యతండు విక్రమార్కుండని తెలిసికొనలేకపోయెను.

విక్రమార్కుండు వారి స్తుతివచనంబుల కుబ్బక యపరాధియని రాజుచే