పుట:కాశీమజిలీకథలు -09.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ఎక్కినగుఱ్ఱము, కట్టిన వస్త్రంబులు గాక యతని చేతఁ గాసైననులేదు. కోరినఁ బంచ భూతములు గాంచన మర్పింపవా? అని యతని ధైర్యము.

అతం డట్లు హుటాహుటి పయనంబులు సాగించుచు నొకనాఁడు మిట్టమధ్యాహ్న మొక యెడారింబడి పోవుచు ఖరకిరణ సంప్తశరీరుండై పెదవులెండ నీరుండు తా వెందునుం గానక పరితపించుచు నరిగి యెట్టకే నొకచెట్టునీడం జేరి వారువము దిగి చెమ్మట లార్చుకొనుచున్నంతలోని

సీ. ఈ దేహభారమింకేనోప నని తెల్పు
                కరణి దారుణ శిరఃకంప మొప్ప
    నక్షత్రమాలిక వ్రేళులందుఁ ద్రిప్పకయె కం
                పమునఁద్రిప్పెటునట్లు బ్రాంతిఁగొలుప
    పొరలడ్డుపటి కన్నులరచూపు లమరంగ
                నొసలు ద్రిప్పుచు బొక్కి నోరుగదల
    నొడలి చర్మకబెల్ల మడతలు వారంగఁ
               బలపల వెలిబట్టతల దలిర్ప
గీ. వీధ్రకృష్ణాజినము చుట్ట వెనుకవ్రేల
    దండ మొకజేత రాగిపాత్ర యొకచేతఁ
    బూని యచ్చోటి కొక వృద్ధభూసురుండు
    వచ్సె నిట్టూర్పు లడర జీవచ్ఛవముగ.

ఇస్సురని నిట్టూర్పులు నిగిడింపుచుఁ గృష్ణాజినము దింపి యతి ప్రయత్నమున నాచెట్టునీడం గూర్చుండి రాగిజారీలోని చిన్నపాత్రలో గొంచెము నీరువోసుకొని త్రాగి వార్చి యిటు నటు చూచుచు నా ప్రాంతమందున్న విక్రమార్కుంగాంచి, ఆ కూర్చున్నవా రెవ్వరుబాబూ! అని అడుగుటయు.

విక్రమార్కుఁడు - భూసురోత్తమా! నమస్కారము. నేనొక బాటసారిని. మీవలనే వచ్చి యిందుఁ గూర్చుంటిని.

బ్రాహ్మణుఁడు - (ఆశీర్వదించి) ఎందుఁబోవుచున్నావు బాబూ?

విక్ర - ఉత్తరదేశ మేగుచుంటి స్వామీ! మీకు సరిపడఁగా నందేమైన యుదక ముండునా.

బ్రాహ్మ - అయ్యో మిగులకేమి ? తృప్తిగా గ్రోలుఁడు అని పంచ పాత్రలో పోసి యిచ్చెను.

విక్ర - నాలుగు పాత్రల యుదకము ద్రావి మేను చల్లఁబడ అమ్మయ్య ఇప్పటికి నేను బ్రతికితిని. బ్రాహ్మణుఁడా! నీకు మంచి పుణ్యమురాఁగలదు. స్వామీ! మీ రెందుఁబోవుచున్నారు ? ఎందుండి వచ్చుచున్నారు ?

బ్రాహ్మ - బాబూ! మాది మణిపురమను నగ్రహారము. ఉత్తరదేశ