పుట:కాశీమజిలీకథలు -09.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(31)

బంగారు స్థంభము కథ

241

వక్కాణింపుఁడని ప్రార్థించిన విని యతండు విక్రమార్కుండని యెఱిఁగి యాశీర్వచనపూర్వకముగా నిట్లనియె.

మహారాజా! నేను చతుస్సముద్రముద్రితమైన భూలోకమంతయుఁ బరిభ్రమించితిని. నా చూడని దేశంబులు, నా చూడని విశేషములు లేవు. నా చూచినంత మేర భవదీయయశోవిసరంబులు వ్యాపించుచునే యున్నవి. అది యట్లుండె. ఇక్కడికి నుత్తరముగా లక్షయోజనముల దూరములో నల్కగిరియను నొక పర్వతము గలదు. దాని ప్రక్క సూర్యగంగయను పెద్దతటాక మొప్పుచున్నది. తత్కాసారమధ్యంబున స్ఫటికశిలాఘటితంబై దేవయాతన మొండు విరాజిల్లుచున్నది. అందుఁ బూజింపఁబడు స్ఫటికలింగంబు సూర్యప్రతిష్ఠితంబని చెప్పుదురు. తదాలయపురోభాగంబు నందలి తటాకజలంబు నుండి సూర్యోదయ సమయమున నొక బంగారుస్థంభంబు బయలు వెడలి తాళవృక్షము వలెఁ గ్రమంబున నెదుగుచు మధ్యాహ్నమైనంత సూర్యునంటి క్రమంబున మరలి సూర్యు డస్తమించువరకు నదిగూడఁ దజ్జలంబున నడంగుచుండును.

ఆ వింత నేను బదిదినములం దుండి కన్నులారఁ జూచితిని. ఆ స్థంభాగ్రపీఠంబున దారుశిలాలోహము లేచి యుంచినను సాయంకాలమునకు భస్మావశేషములై కనుపట్టుచుండును. అది సూర్యాకర్షితయంత్రమో జాలతంత్రమో యెవ్వరికిం దెలియదు. ఆ స్థంభం బెంతకాలమునుండి యట్లుత్పన్న మగుచున్నదో యెఱింగిన వారు లేరు నేఁ జూచిన దానిలో నిదియే విచిత్రమైన వార్తయని తెలిపిన వినివిక్రమార్కుండు మూపు లెగరవై చుచు మంచి వింత వార్తఁ దెలిపితిరి. సంతసించితినని ముఱియుచు నయ్యతివలన నప్పర్వతమునకు మార్గము దెలిసికొని యక్కడికి వెళ్ళువఱకే సంవత్సరము పట్టునని విని యా పరివ్రాజకు ననుమతి వడసి యింటికి వచ్చి యిట్లు ధ్యానించెను.

ఆ సూర్యగిరి యిక్కడికిఁ జాలదూరములో నున్నది. గుఱ్ఱమెక్కి రాత్రిం బగలు పోయినను సంవత్సరము పట్టును. ఈ వార్త భట్టి వినిన నడ్డు పెట్టును. శ్రీధరుఁడు విఘ్నము సేయును. భద్రుం డంగీకరింపఁడు. ఎవ్వరికిం దెలియకుండ బోవుటయే యుచితమని నిశ్చయించి నేను వచ్చువఱకు రాజ్యము భట్టి పాలించుచుండ వలయునను పత్రిక వ్రాసి పరుపుక్రింద నిడి మలయపతిని బుట్టినింటి కనిపి యయ్యసహాయశూరుండు చంద్రహాసమాత్రసహాయుండై యొకనాఁడు వేకువజాము నేకాంతముగా గుఱ్ఱ మెక్కి యుత్తరాభిముఖుండై

శో. నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశ హేతవే
    త్రయీమయాయత్రిగుణాత్మధారిణే విరించినారాయణశంకరాత్మనె.

కాని ద్వాదస్తసు వాత్మ సన్నిధానము గల్పించుకొని ధ్యానించుచు బయలుదేరి పోవుచుఁ దెల్ల వారు వఱకుఁ బెద్దాదూరము పోయెను. చేతఁ జంద్రహాసము,