పుట:కాశీమజిలీకథలు -09.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలయవతి కథ

231

నేఁడవ యంతరమునకుఁ బోయితిని. ఆహా ! అందలి యలంకారములు వినుతింప బ్రహ్మ శక్యముగాదు. కన్నులకుఁ గట్టి నట్టున్నవి. ఆ వింతలం జూచుచుఁ బోవం బోవ దివ్యాలంకార శోభితం బగు నొక సుందర మందిరంబున హంస తూలికాతల్పంబున బండుకొని యున్న యొక యన్ను మిన్న నా కన్నులం బడినది.

అందా పొన్న కొమ్మం గాంచి నేను మేను బులకింప బంగారు బొమ్మ యేమో యని తిలకింపుచుండ నక్కలువంటి యట్టె లేచి నల్లన వచ్చి నమస్కరించి యించుక మోముపంచి మనోహరా! మీ కొఱకే యిందు వేచియున్నదాన ననన్యరక్త నన్ననురక్తి నధీనం గావించుకొనుచు మీరే నా భర్తలని పలుకుచుఁ దొంగలిరెప్పలల్లార్చుచు నా మొగం బవలోకించుటయు నేను పరవశుండనై నీ వెవ్వతె వెవ్వరిదానవు? పే రెయ్యది అని యేమియు నడుగక యుడుగని తమిందటాలున నవ్వాలుగంటిం గౌఁగిలించుకొంటి. ఆహా! తత్పరిరంభణ సంరంభము దలంచుకొన మేనం బులుకలు నొడము చున్నవి చూడుము. అట్లు -

చ. బెగియఁ గవుంగలించుకొని భీతమృగేషణ సిగ్గువాపి నె
    మ్మొగమున భూము జేరిచి కపోలయుగం బొగిముద్దు పెట్టుకొం
    చగణిత వీలఁగ్రాల మధురాధర సార సుధారసంబు గ్రో
    లఁగఁదమి నంగుళీరచనలం బెదవి దఱిఁ జేర్చునంతలోన్.
గీ. విక్రమార్క మహీపాల! విజయశీల!
   మిత్రుఁ డుదయాద్రి కూట సమీపమునకు
   వచ్చుచున్నాఁడు చీకటుల్ వ్రయ్యజేసి
   మేలుకొనుమయ్య హంలోగ మేలుకొనుము.

అని పాడుచు నాపాడు వైతాళికుఁడు నా స్వప్నసుఖంబున కంతరాయము గలుగఁజేసెను. శ్రీధరా! ఆయన్ను మిన్న నా కన్నులకుఁ గట్టినట్లున్నది గదా? ఆ యెలనాగ సోయగంబు త్రిజగ నాశ్చర్యకరంబు వినుము.

చ. కలికిమిటారితళ్కు వెలికన్నులు జేరలమీరిమ్మి రే
    కుల నిరసించు నద్దములకున్ రుఁచి దప్పులు దిద్దు ముద్దు చె
    క్కులు దవమేగళంబులు చకోరయుగంబు లారు చీ
    మల నునుబారు గేరుఁ దరమా? కరమా చెలిరూపమెన్నగన్.

గీ. తరుణి కెమ్మోవితగు నమృతంపు బావి
    రమణి పాలిండ్లు మరుని పిరంగిగుండ్లు
    బాలకైతళ్కు బంగారుఁ చూలఁబల్కు
    రమణి నవ్వు నిండు వెన్నెలలనవ్వు.

ఉ. చల నూ కురులా గళంబు డం
ఆ పసి వివ మనను మాతొడ లౌపద ద్వయం