పుట:కాశీమజిలీకథలు -09.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలయవతి కథ

229

వాఁడు నా కలలో గనంబడినవాఁడేనా యేమి ? ఇది యక్షిణీ ప్రభావము గాదుగద. ఇట్టి కళ్యాణ ప్రసంగంబులు తథ్యంబు లగుచుండునా ? బాపురే యని యాశ్చర్యమందుచుండఁ దలోదరి యిట్లనియె.

దీని నీవు గలలోఁ జూచినవాని చిత్రఫలకము వ్రాసితివి ఆమె ప్రత్యక్షముగాఁ జూచి వ్రాసినది. రెండు నొక్క పోలికగా నుండుట నాతఁడే యీతఁ డనుటకు సందియము లేదు. యక్షకాంత చెప్పిన మాటలలో నణుమాత్ర మతిశయోక్తి యుండదు. దైవఘటన మత్యద్భుతము. శుభములు చేకూరునప్పుడు నన్నియు నట్లే ప్రోగుపడును. ఆమె జపము నుండి లేచినది. ఆమె యొద్దకుఁబోయి ప్రత్యక్షముగా నతనిం జూచు ప్రయత్నము జేయుదము గాక రమ్మని చెప్పిన నయ్యొప్పుల కుప్ప యప్పుడే యా యక్షిణి యున్న గదిలోనికిం బోయి యామెకు నమస్కరింపుచు నిట్లనియె.

తల్లీ ! నీ యకారణవాత్సల్యమునకు మిగుల గృతజ్ఞులము. నా పరిచారిక నీకడఁ దెలియక యేమేమియో వంకలు జేసెనఁదట. ఆ తప్పు నేను మన్నింప వేడుచున్నాను. తోఁటలో నున్నప్పుడు మా తలోదరితో నీవు నా కేదియో యుపకారము జేయుదునని వర మిచ్చితివఁట. దానిం దయచేయుమని యిప్పుడు నేను గోరుచున్నాను అని వేడుకొనుటయు నవ్వుచు యక్షిణి యిట్లనియె.

నాతీ ! నీవు నే నిచ్చిన చిత్రఫలకము జూచితివా ? నీ వాతనికిఁ దగుదువని నిశ్చయించితిని. నీవు గోరిన గుణంబులన్నియు వానియందున్నవి. నీ వంగీకరించిన నిప్పుడ పోయి ముహూర్తము నిశ్చయించెద నా వెంట నీ పరిచారికం బంపుమని యడిగిన మురియుచు మలయవతి యిట్లనియె.

దేవీ ! నీ కింకొక విశేషముఁ జెప్పమరచితిని. నాకు రాత్రి వింతయైనకల వచ్చినది. అందు నీ వెఱింగించిన సుందరుఁడు నా డెందము హరించి వింతపనులు జేసికొనియెను. నీ వెఱింగించినవాఁడే యతఁడని చిత్రఫలకముల వలనం దేలినది. ఇదిగో యతండు కన్నలకుఁ గట్టి నట్లుండ చిత్రఫలకము నేనువ్రాసితిని. చూడుము. ఈతఁ డాతఁ డగునో కాడో విచారింపుము స్వప్నము యధార్థము జేసి నా యభీష్టము నెరవేర్పుమని ప్రార్థించినది.

యక్షకాంత - కాంతా ! నీ యభీష్టము పరమేష్ఠియే నెరవేర్చెను. నీ కాతండు భర్తయని బ్రహ్మ లిఖించియున్నాడు. కానిచో నేనింత దూరమేల వత్తును ? కానిమ్ము. నీవు నీ గది యలంకరించుకొని యుండుము. మదీయ యక్షిణీ ప్రభావంబున నమ్మహానుభావు నిందుఁ దీసికొని వచ్చి నీ కర్పించెదఁ దరువాత నీ యిష్టము వచ్చినట్లు జరిగించు కొమ్మని పలుకుచుఁ దదామంత్రణంబు వడసి మనోవేగముగా నుజ్జయినీ నగరంబున కరిగి నృపాలుని శుద్ధాంతము జేరినది

అప్పుడు విక్రమార్కుఁడు తల్పంబునం బండికొని యుండ శ్రీధరుఁ డను