పుట:కాశీమజిలీకథలు -09.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

త్రము విన భూత బేతాళాదుల వశము జేసికొను మాంత్రికుండట్లు తోచుచున్నది. తదితరగుణ విశేషము లేమియుఁ దెల్లము కాలేదు. భూలోకమునంగల కలకంఠులలో నతనికిఁ దగిన మగువ దొరకలేదని చెప్పిన మాట యెంతసత్యమో గ్రహింపవలయును. వాని చిత్రఫలకము దెచ్చినదేమో యడుగుము. నా స్వప్నమున కీమె మాట లుపశ్రువతులవలె నున్న వని తోచుచున్నది. భగవత్సంకల్ప మెవ్వరికి దెలియదు. యుక్తిగా మాట్లాడి తద్విశేషంబులం దెలిసికొని రమ్మని పంచిన నమ్మించుబోఁడి మెల్లన నా గదిలోనికిం బోయి తజ్జపావశాన సమయ మరసి నమస్కరింపుచు నిట్లనియె.

దేవీ ! నీకుఁ బూజాసమయ మగుటచేఁ దరువాతి కథ వినుటకు మా కవకాశము గలిగినదికాదు. నీ సఖురాలు కోరిన గుణంబులన్నియు గల వరుం దీసికొని వత్తునని నాతోఁ జెప్పియుంటిమి. అతం డీతండేనా యేమి ? అట్లైన భూతభేతాళ వశ్యము తప్ప తదీయ సాహస వితరణాది గుణవిశేషంబులెఱింగించితివి కావేమి? అని యడిగిన నవ్వుచు నా జవ్వని యిట్లనియె. ముదితా ? తదీయ సాహస వితరణాదిగుణ లేశ కథంబునకు ననంతుం-------------- మము బోటివారి కెట్లు శక్యమువినుము.

చ. కనుఁగొనవేయి ----------------------- యున్
    మనమున సంచలన అనంచిన యొసంగు నర్దికిం
    గొనకొని విక్రమార్క నృపకుంజరుఁ డంచితదానశీలుఁడై
    యనుదిన మీ వ్రతంబొక మహాద్భుతమంచు వచింపనేటికిన్.

గీ. ఎంత వెలగల వస్తువయేని చేత
    నున్నఁ జాలిచ్చివేయు నాసన్నవర్తి
    యైనయాతఁడె పాత్రుండు దానమునకు
    నతని వితరణమెన్న బ్రహ్మకు వశంబె.

మఱియు నదియిది యననేల నడిగినంతఁ దన ప్రాణమునై నఁ గోసి యిచ్చెడు మహానుభావున కితరవస్తువులు లేక్కయేల ? ఉట్టికోసిన కథయుఁ భేతాళుం గట్టి తెచ్చిన విధానమును వినియు నతని సాహసగుణం బెట్టిదని యడిగితి వింతకన్న నవివేక మున్నదా? తదీయసౌందర్యాతిశయముఁ జూతువేని ఇదిగో చిత్రఫలకము చూచుకొమ్మని చేతికిచ్చినది.

తలోదారి దాని నందుకొని వింతఁ జూచుచు మెచ్చుకొనుచుం దీసికొనిపోయి మలయవతి కిచ్చినది. అది తాను వ్రాసిన దనుకొని యవ్వనిత యిది నీ చేతి కెట్లు వచ్చినది? దర్పణపేటికనుండి తీసితివా? అని యడుగుటయు నవ్వుచు నా జవ్వని యక్షకాంత చెప్పిన మాట లన్నియుం జెప్పి యిది ఆమె వ్రాసి తెచ్చిన చిత్రపటమని యెఱింగించినది.

అప్పు డాచిన్నది మున్ను వ్రాసిన చిత్రఫలకము దెప్పించి చూచి రెంటికి నించుకయు భేదము లేకుండుట తిలకించి ఔరా! యెంత చోద్యము? ఆమె చెప్పిన