పుట:కాశీమజిలీకథలు -09.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టింటాకరాళుని కథ

223

దప్పునట్లు కాన్పించదు. ఇందుండి లేచిపోవుదుమా అని యాలోచించుచున్నాము. కాని చిరకాల వాససుఖంబు విడువ నంగీకరింపకున్నది. సొమ్మియ్యకున్న వీఁడు మొండిగరాసు. ఎట్టిపనియైనం జేయఁగలఁడు. ఈ చిక్కులోఁబడి నిద్రాహారములు లేక విచారించుచున్నా మని మాతృదేవత లెఱింగించిరి. ఆ చాముండ నవ్వుచు నో హో! ఇదియా మీ వంత? యుక్తిఁ దెలిసిన యా వంతయు మీకుఁ జింత యుండకపోవుంగదా? జూదరుల పరిపాటి మీరెఱుంగరు కావున నిట్లడలుచున్నారు వినుండు. నేఁటిరాత్రి వాఁడు మిమ్ము జూదమాడఁ బిలిచినప్పుడు మేమాడఁజాలమని ప్రతివచన మీయుఁడు. అప్పుడు మీ జోలికి రాఁడు. వాఁడు నిత్యము పిలుచుండ మీ రూరకొనుటం జేసి యదియే యంగీకారమని తలంచి మీ పని పట్టుచున్నాఁడు. ఆటకు రా మనిన మిమ్మేమియుం జేయఁజాలడని యుపాయముఁ జెప్పి యా శక్తి యరిగినది.

మాతృగణము ఆనాఁడు మిగుల సంతసించుచు రాత్రి వాఁడు జూదమునకుఁ బిలిచినంత -

గీ. ఓయి టింటాకరాళ ? వోవోయి నేఁడు
   జూద మాఁడగ రాము నీ మీద మేము
   జాల యోడితి మింక మా జోలిరాకు
   మొరులతో నాడుమని పల్కి రూహదెలిసి.

ఆ మాటలు విని వాఁ డేమియు మాటాడక అయ్యో? వీరీ యాట పరిపాటి యెట్లో తెలిసికొనిరి నిత్యము బంగార మబ్బుచున్నదని యుబ్బుచుంటి నేఁ డేమి జేయుదునని యాలోచించుచు నాయావరణములో వేఱొక్క దెసనున్న భైరవాలయము కడకుఁబోయి -

గీ. కాలభైరవ ! నీకక్ష కేలియందుఁ
   బ్రీతియుండకపోవ దీ రేయి నీవు
   జూదమాడుము నాతోడఁ జూతునీదు
   పటిమ దీనికిఁ దగినట్టి పణము పెట్టి.

అని యాటకుం జీరిన భైరవుండు మాతృగణములు నిత్యము పడియెడు నిడుము లెఱింగియున్న వాఁడగుట మౌనము వహింపక వెంటనే యిట్లుత్తర మిచ్చెను.

గీ. ఓయి! టింటాకరాళ! పోవోయి నేఁడు
   జూదమాడఁగరాను నీమీఁద నేను
   జాలనోడితి నింక నా జోలిరాకు
   మొరులతో నాడుకొనుమని యుక్తిఁబలికె.

ఆ పలుకులు విని వాఁ కులుకుచు ఓహో ? వీ రెట్లో ద్యూతక్రీడామర్మములు గ్రహించిరి. ఏమి చేయుదునని యాలోచించుచు నందున్న దేవతావిగ్రహముల నెల్ల జూదమునకుఁ బిలుచుచుండ నవి యంత్రములవలె వెంటనే టింటాకరాళా!