పుట:కాశీమజిలీకథలు -09.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాకినేయుని కథ

219

వారి తలిదండ్రుల కెఱింగించుటయు నత్యంత దుఃఖ పరిభూత చేతస్కులై వా రఱుదెంచి,

శా. అమ్మా ! రమ్మిది యేమి పాపమిటు లుగ్రాకారవైయుంటి మీ !
    యమ్మ న్నన్ను నెఱుంవోయని యమాత్యాభాస్య చేరింజనన్!
    హుమ్మంచు న్వెఱపించె మంత్రిసుత రౌద్రో ద్రేక మేపారఁ గ
    న్బొమ్మల్ ద్రిప్పుచుఁ బారిరాప్తజను లమ్మోయంచు నార్తధ్వనిన్.

మఱియు నాతలోదరు లస్మదావేశంబునం జేసి యనేక వికార చేష్టలఁ బ్రకటింపుచుఁ జూడవచ్చిన వారినెల్ల జావమోదుచుండఁ దజ్జనకు లతిరయంబునం బఱచి విక్రమార్క మహారాజున కంతయు నివేదించిరి.

అన్నరేంద్రుండు కృపాణపాణియై మాయన్న నెలవుల కరుదెంచుటయు దుర్నిరీక్ష్యంబగు తేజంబున నొప్పు నతనిం గాంచినంత మాస్వాంతంబు లత్యంత భయాక్రాంతమ్ములైనవి. సింగంబునుంగన్న మాతంగమ్ములువలె వెఱచుచుమే మాపడుచుల విడిచి కాలికొలఁది పరిగిడఁ దొడంగితిమి.

తదీయ ప్రతాపానలజ్వాలలు నలుమూలలు వ్యాపింప మా చూపులకు మిఱిమిట్లు గొలుపుచు మమ్మేదెసకుఁ బారిపోనీయక వేడి గలుగఁ జేసినవి. ఎందుఁబోవుటకుఁ గనులు గానక తొట్రుపడుచున్న మాకడ కమ్మహాత్ముం డరుదెంచి హుంకారముతో మమ్ము బరిభవింపఁ బూనుటయుఁ బాదంబులం బడి నిన్ను శరణుఁ జొచ్చితిమి. రక్షింపుమని ప్రార్థించితిమి. అక్కరుణాకరుండు మమ్ము జంపక పాపాత్ములారా ? ఇక నెన్నఁడేని యిట్టి పని చేసితిరేని మిమ్ము భస్మము జేసెద నిందుకుఁ బ్రాయశ్చిత్తముగా మీకొక సంవత్సరము శిక్ష విధించితి నెక్కడికిం బోకుండ మా యూరి బయటనున్న పాడు నూతిలో బడి యుండుఁడు. అని పలుకుచు మమ్ముఁ గట్టించి యీ నూతిలో బడవేయించెను.

సంవత్సరమునకు నిఁక నెనిమిది దినములు కొఱఁతగా నున్నవి తరువాతఁ బైటికి వత్తుము. డాకినేయా ? నీవు మాకొక యుపకారము సేయుదువేని నిన్నీ కూపము నుండి పై కెక్కింతుము. క్షుద్బాధ మాకెక్కువగా నున్నది. ఈ యెనిమిదిదినములు నిత్యము సరిపడిన యాహారముదెచ్చి మాకర్పించుచుండవలయును. ఇది మాకోరిక. యేమందువు ? ఇప్పు డొప్పుకొని పిమ్మట మఱియొకరీతిఁ గావింతువేని పైకివచ్చినతరువాత ముందుగనే నీపని పట్టెదము సుమీ. బ్రహ్మరాక్షస ప్రభావం బెఱుంగుదువా ? అని పలికిన విని యా జూదరి వారిమాటల కనుమోదించెను.

బ్రహ్మరాక్షసులు మెల్లఁగా వాని నూతిపై కెక్కించి విడిచివేసిరి. ఆ జూదరి కొంతమాంసము సంపాదించి నాటిరాత్రి శ్మశానవాటికలోఁ దిరుగుచు మాంసమో యయ్య మాంసము, కావలసిన భూతభేతాళములు వేగముగా రండు, కడు మంచి మాంసమని కేకలు పెట్టెను. ఆ ధ్వని విని నేను మెల్లఁగా వాని దాపునకుఁ