పుట:కాశీమజిలీకథలు -09.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(28)

డాకినేయుని కథ

217

నాకాహారము గానున్న యీ శవములో దూరి గంతులు వైచుచున్నావు ? నీయుదంత మెఱింగిన నదిగో! ఖడ్గహస్తుండై యమహారాజందు నిలువంబడియున్నవాఁడు. నీపీచ మడంచఁగలఁడు. వారిసామర్థ్య మెఱుఁగక నీవిట్లు వచ్చితివని పలికిన విని వాఁడు వెక్కిరించుచు విక్రమార్కుఁడన నెవ్వఁడు ? ఢాకినీవల్లభుఁడా? భూతచక్రవర్తియా? భేతాళసార్వభౌముఁడా? అతనిపేరు సెప్పి నన్ను బెదరింపుచుంటివి? నీ మాటలకు నేను వెఱచువాఁడనుగాను. పోరరమ్ము. రాకున్న నీయాహారము నాకిచ్చి పొమ్ము అని బెదరించిన నవ్వుచు నగ్నశిఖుం డిట్లనియె.

ఓరీ? దుర్మతీ? నేను నీకు వెఱచి యట్లంటి నసుకొంటివిరా? స్వజాతిప్రీతిచే హితము జెప్పిన వెక్కిరించుచుంటివి? ఆతఁ డెవ్వఁడొ చెప్పవలయునా? తదీయ ప్రభావద్యోతకమగు నొక్కకథఁ జెప్పెద నాలింపుము. నీకుఁ దెలియఁగలదు.

డాకినేయుని కథ

ఈ నగరంబున డాకినేయుండను జూదరి గలఁడు. జూదరులలో నట్టి మొండివాఁడు లేడు. వాఁడు జూదమాడి పెక్కురొక్కము సంపాదించెను. తాను గెలుచునా సొమ్మిమ్మని యప్పుడే వేధించును. ఓడెనా? గద్దించి యెగవేయును కితవు లందరు గుమిగూడి జూదమాడి వాని నోడించిరి. ఓడిన సొమ్మిమ్మని యడిగిననేమియు మాటాడక రాతివిగ్రహమువలెఁ గదలక కూర్చుండెను. జూదరులు త్రాళ్ళతోఁ గట్టి వానిని జెట్టునకు వ్రేలాడఁగట్టి కశలతోఁ గొట్టిరి ఎట్లు నిర్బంధపెట్టినను చట్టురాయివలెఁ గదలక కిక్కురుమనక యట్టె నిలువంబడి యుండెను. అట్టి మొండెకట్టె భూలోకములో లేఁడు. ఆ ధూర్తులు వానిం గొట్టుటకు విసుపుఁజెంది. వానిం బట్టి మోసికొనిపోయి యూరిబయట నున్న యగాధమగు పాడునూతిలోఁ బారవైచి తమ నెలవులకుఁ బోయిరి.

వా డాచీఁకటి నూతిలోఁబడి కొట్టుకొనుచున్న సమయంబున నందున్న యిరువురు పురుషులు వానిం బట్టికొని యోరీ? నీవెవ్వఁడవు? ఇందేల పడితివి? నీ వృత్తాంతము జెప్పుమని యడిగిన వాఁ డిట్లనియె. మహాత్ములారా? నేనొక జూదరిని. ఢాకినేయుఁడనువాఁడఁ గితవులు నన్నుఁ జావఁగొట్టి యీ నూతిలోఁ బడవేసి పోయిరి. మీరెవ్వరు? ఇందేల యుంటిరి? నాయాపద దాటింపవచ్చిన భగవంతులని తోఁచు చున్నది. నన్నీనూతినుండి దాటించి రక్షింపుఁడని వేడుకొనుటయు వాండ్రిట్లనిరి.

ఢాకినేయా? మేమిద్దరము బ్రహ్మరాక్షసులము. వెనుకటి జన్మమునందు మేము గావించిన దురంతచర్య లనేకములు గలవు వినుము.

ఉ. దారులు గాచి పాంథసముదాయము డాయఁగ నడ్డమేగి కాం
    తారములందు దోచికొని తద్ధనమెల్ల దయావిహీనతన్
    వాగదినించినన్ దలలు వ్రయ్యలు సేయుచు ఘోరతస్కర
    క్రూరకఠారచర్యల నరుల్ బెదరం జరియించు చాదటన్.