పుట:కాశీమజిలీకథలు -09.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనమంజరి కథ

215

క. కాపాలిక మంత్రస్థుం
   డై పరువడి భైరవుం డహంకారముతో
   నేపనియైనను జేయుఁ త
   దాపాదితఁబట్ట శక్యమా? విధికైనన్.

ఇప్పని మనవలనం దీరునదికాదు. పరమేష్టికడకుఁ బోయి ప్రార్థింపు మనుడని యుపాయముఁ జెప్పుటయు దదామంత్రణంబున రాజరాజు మే మనుసరించి రా బ్రహ్మలోకంబునకుఁ బోయి తద్పాద పద్మములకున మస్కరింపుచు నిట్లు విన్నవించెను.

సీ. విశ్వేశ ! వినవయ్య విన్నపంబొక్కటి
              వీఁడు నాతమ్ముఁడు వీనిభార్య
    యిది వీరు క్రొవ్వినెమ్మది నింటనుండ లే
              క సని నుజ్జయినీపురాంతికమున
    వెలయు పూఁదోఁటలో విహరింపఁ గాపాలి
              కాధముండొక్కఁ డియ్యతివ వలచి
    మంత్రబద్ధగఁ జేసి మగువఁ గొంపోవంగ
             హోమంబుఁ గావింపుచున్న వాఁడు
గీ. నరుల కమరులు భయపడు తఱులు వచ్చె
    నొక్కొ! దానికిఁ బ్రతిహతం బొకఁడు లేదె ?
    సృష్టికర్తవు నీవేమి చేయలేవు
    తాత? తప్పింపు మీయార్తి తలఁచి మాకు.

అని ప్రార్థించుటయుఁ జతుర్ముఁడు ముఖంబులఁ ద్రిప్పుచుఁ గుబేరా ! గరుండనినట్లు కాపాలికుల మంత్రబలం బట్టిదేసుమీ ! తన్మంత్రాదిష్టాతయగు భైరవుని పాప నెవ్వఁ డోపగలఁడు. ఇందులకొక యుపాయంబు సెప్పెద నాలింపుము. ఆ యుజ్జనీపురం నప్పుడు విక్రమార్క మహారాజు పాలించుచున్నాడు. ఆ నృపతిపేరు దలంచినంత భూతభేతాళ భైరవాదులు పలాయనము లగుచుండును. వాఁడీ చేడియను మంత్రబద్ధంజేసి లాగికొని పోవునప్పుడు విక్రమార్కునిగుఱించి యాక్రోశింపుము. నీ యాపద దాటఁగలదని యెఱింగించిన విని విరించి నభినందింపుచు మే మందసము మఱల నలకాపురంబున కరుదెంచితిమి.

నాలుగుదినంబులు సుఖం బుంటినో లేదో యొకనాడు కపాలహస్తుండు భూతసేవితుండు భయంకరాకారుండునగు భైరవుండు నాకడకువచ్చి పదపద కాపాలి సెలవైనది. అని నాచేయి పట్టుకొని లాగికొని పోవుచుండెను. నేను మొఱపెట్ట నా యలకాపురంబులోన వారెల్ల వచ్చి యడ్డుపడిరి. కాని వాని నాపలేక పోయిరి. ఆ భైరవుడు బలాత్కారముగా నున్న భూలోకమున కీడ్చుకొని పోవుచుండెను. అప్పుడు