పుట:కాశీమజిలీకథలు -09.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బేతాళవశ్యము

205

స్వీకరించును. మా వెంట రమ్మని పలుకుచు గుఱ్ఱమెక్కించుకొని తమ నగరంబునకుఁ దీసికొని పోయిరి.

రాజపుత్రుఁ డాపద్మనేత్రిం బెండ్లియాడి వేడుకలం గుడుచుచుండెను. పద్మావతి తలిదండ్రులు పుత్రికావియోగశోకంబునఁ బరితపించుచు నా యడవికిఁబోయి వెదకి వెదకి పద్మావతిం గానక యాకనకగాత్రిని మృగములు భక్షించినవని నిశ్చయించి మోహాతిశయంబునఁ బ్రాణములు విడిచిరి.

అని భేతాళుం డాకథ జెప్పి మహారాజా? ఇందు నాకొక్క సందియము గలుగుచున్నది. దాని నీవు విడఁగొట్ట వలయును. ఆ దంపతులు శోకవేగంబున బలవంతముగా మృతినొందిరిగదా? ఆ పాపము మంత్రిపుత్రునిదా? రాజపుత్రునిదా? నీవు మిగుల బుద్ధిమంతుఁడవు. నిరూపించి చెప్పుము. తెలిసియుండియుఁ జెప్పకుంటివేని నీ తల నూరువ్రక్కలై పోగలదు సుమీ? అని యడిగిన విని శాపభీతిచే నూరుకొనక యిట్లు చెప్పెను.

భూతపతీ? ఆ పాతకము ఆ మువ్వురలో నొకనికిం జెందదు. ఆ దేశ మేలెడు కర్ణోత్పలునికిఁ జెందునని పలికెను. అయ్యో? అందులకుఁ గారకులగు నా ముగ్గురిలో నొకని కంటవలెఁ గాని రాజేమి యెఱుంగును? అతని నెట్లు చెందఁగలదు? హంసలు శాలుల భక్షించిన కాకుల శిక్షింపవచ్చునా? అని యడిగిన విక్రమార్కుం డిట్లనియె.

భూతేంద్రా! వారు ముగ్గురు దోసకారులు కారు వినుము. మంత్రిపుత్రునకు ప్రభుకార్యము దీర్చుట విధి. పద్మావతీరాజపుత్రులు కామశరాగ్ని తప్తులగుట స్వార్థమును సంపాదించుటలో దోషములేని వారలే. కర్ణోత్పలుఁడు నీతిశాస్త్రముల శిక్షింపఁబడనివాఁడు చారులచే లోకుల నిజానిజంబులఁ బరీక్షించుచుండవలెను. ఎవ్వఁడో వచ్చి యేదో చెప్పినంత మాత్రమున నిజము విమర్శింపక ప్రజల దండింపవచ్చునా? అదండ్యుల దండించిన రాజు మహాపాతకముఁ బొందఁగలఁడు. నిర్దోషిణియైన పద్మావతిని దండించుటచే దాని తలిదండ్రులు దేహత్యాగము గావించిరి. అందులకుఁ గారకుఁడు రాజుగాక వారా? అని చెప్పినంత సంతసించుచు నా భేతాళుఁడు అతని భుజమున నదృశ్యుండై శింశుపాతరుమూలము జేరెను.

భేతాళవశ్యము

విక్రమార్కమహారాజు తన భుజంబున భేతాళుం డట్లదృశ్యుఁ డగుటయు వెఱువక మఱల నత్తరువరంబు చెంతకరిగి యందు వ్రేలాడు వళముం బరికించి వెనుకటివలెనే యాకుణపమును నేలం బడనేసి కాలు సేతులుం గట్టి స్కందమునం బెట్టుకొని మౌనంబు వహించి వచ్చుచుండ బేతాళుం డొక కథ జెప్పి యందలి సందియము దీర్చు