పుట:కాశీమజిలీకథలు -09.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4]

విజయపాలుని కథ

25

యార్యులు సెప్పుదురు. నాజన్మమున కెల్ల గొప్పపాతకము జేసితిని. ఈ మహోపద్రవమునకుఁ గారణభూతురాలను నేనే యైతిని. వినుండు అని కన్నీరు గార్చుచు గద్గదకంఠముతో సుమతి మహానీతిశాలి, పుణ్యాత్ముఁడు పరమోత్తముఁడు, పరదారాపరధనపరాఙ్ముఖుఁడు. జితేంద్రియుఁడు. అట్టి సుగుణాకరుని నిరపరాధి నపరాధియని దండింపఁజేసిన పాపాత్ముఁరాలను నేనే. ఇఁక దాచనేల? స్త్రీ చాపల్యంబునంజేసి వాని సోయగమునకుఁ జిక్కి మక్కువతోఁ గోరినదానను నేనే. ధర్మబద్ధుండై యత డంగీకరింపక నన్నుఁ దల్లిగా భావించి పరమార్థోపవేశము గావించినను యౌవనమదంబున నావేశింపఁబడి లేనిపోనికల్పనలఁ జేసి మీతోఁ జెప్పి వానిఁ బరాభూతుం గావించితిని. మహాత్మా! రక్షింపుము. నిజము చెప్పితిని. నాకుత్తమలోకము గలుగునట్లను గ్రహింపుమా. సుమతి నిరపరాధి. నిరపరాధి. ఐదుసారులు మిమ్ము మృత్యుముఖంబు నుండి తప్పించిన పరమోపకారి. విమర్శింపక వానిం బరిభవించిన మీకు జయమెట్లగునని పలుకుచున్న సమంయంబున శత్రువీరులు కొందఱు వచ్చి యమ్మచ్చెకంటి కొప్పుబట్టికొని యీడ్చుచున్న సమయంబున రాజు తనచేతనున్న కరవాలంబునఁ దొలుత నాప్రోయాలి శిరంబుత్తరించి తరువాత నాకింకరులఁ బలువురం బరిమార్చి కటారి నేలం బారవైచి గుప్తగృహంబునకుం బోయి యందుఁ బండుకొని యాత్మహత్యఁ గావించు కొనియెను.

తరువాత శత్రుభూనేత లిరువురు నయ్యుదంతము విని పరమానందముతోఁ గోట నాక్రమించుకొని రెండు భాగములుగాఁ బంచుకొని పాలించుచుండిరి. కథ కంచికిఁ బోయె నే నింటికి వచ్చితినని యా శకుంతము కథఁ జెప్పినది.

అప్పుడు రాజవాహనుఁడు మిక్కిలి సంతసించుచుఁ బతంగపతీ ! మంచి కథఁ జెప్పితివి. మెచ్చితిమి కాని సుమతిమాట యేమియుం జెప్పితివికావు. అతం డెందుఁ బోయెను? శత్రువులం గూర్చుకొని వచ్చినవాఁ డతఁడా కాఁడా? వారంతట వారే వచ్చిరా యెఱింగింపు మనవుఁడు నాయండజము బిడ్డలారా! నాకేమియుఁ దెలియదు. సుమతి యేమయ్యెనో నే నెఱుఁగ నాకు వచ్చినకథ చెప్పితిని తరువాతి వృత్తాంతము నాజోడుపిట్టకు వచ్చును. నాకేమియు రాదు. విజయపాలుండు గుప్తగృహంబునుండి పారిపోయెనని యొక వదంతి యున్నది. నే నెఱింగిన కథతో సమసినట్లే యున్నదని చెప్పినది.

అప్పుడు రాజవాహనుఁడు చెల్లీ! సుమతి విషయమై నీయభిప్రాయమేమి? శత్రువులఁ గలిసెనా? లేదా? అని యడిగిన నాబాలిక కలిసియే యుండును. లేకున్న వారిరువురు నంతలో గోట ముట్టడింపరని చెప్పినది. లేదులేదు సుమతి గుణవంతుఁడు అట్టి కృతఘ్నత్వకార్యముఁ గావింపఁడు. వాని కేమియు దెలియదని నా యభిప్రాయము. సుమతి లేఁదని యెఱింగి వారు ముట్టడించి యుందురు. అని పలికినఁ గాదు ఎరిగియే శిక్షింపజేసె నని చెల్లెలు వాదించినది.