పుట:కాశీమజిలీకథలు -09.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మావతి కథ

203

దించితివని యడిగిన నతండు కింకరులారా? దీని వృత్తాంతము నా కేమియుం దెలియదు. నా గురు వీవీటి శ్మశానవాటికలో జపము చేసికొనుచున్నవాఁడు. అతండు దీని నమ్మి సొమ్ము దెమ్మనుటచేఁ దెచ్చితినని వాక్రుచ్చుటయు నా రాజభటు లతని నా వస్తువుతో గ్రామాధికారి యొద్దకుఁ దీసికొనిపోయి చౌర్యవస్తువును జాపుచు నతండన్న తెఱంగెఱింగించిరి.

అప్పుడు గ్రామాధికారి దంతఘాటకునిని బిలిపించి యా హారము నీ పుత్రిక దేనా? అని యడిగిన నతం డౌను. ఇది నా కూఁతురు ధరించునది. మిక్కిలి వెలఁ గలదని యెఱింగించెను. అప్పుడు నగరాధ్యక్షుఁడు రక్షకపురుషులతో రాజపుత్రుని వెంటబెట్టుకొని శ్మశానవాటికకుఁ బోయి యందు మహాతపస్వివలె జపము జేసికొనుచున్న మంత్రిపుత్రుం గాంచి యయ్యధికారి నమస్కరింపుచు మహాత్మా! నీవు సర్వసంగపరిత్యాగ యోగ్యంబగు నాశ్రయంబున వసించియు నీ ముక్తాదామంబెట్లు సంగ్రహించితివి? దీని మీ శిష్యున కిచ్చి యమ్మమని చెప్పితివఁట సత్యమేనా? అని యడిగిన మంత్రిపుత్రుండు మెల్లనఁ గన్నులం దెరచి వారినెల్లఁ గూర్చుండుడని సంజ్ఞ చేయుచు నిట్లనియె.

నేను బరివ్రాజకుండ నొకచోట నుండువాఁడను గాను మహారణ్యముల సంచారము చేయుచుందును. నేను దైవికముగా నాలుగుదినముల క్రిందట నీ యూరు వచ్చి రాత్రి స్మశానములో బసఁజేసితిని. అప్పుడు నేనిందర్దరాత్రంబున యోగినీసమూహ మొకటి తిరుగుచుండఁ జూచితిని. వారిలో నొక యోగిని రాజపుత్రుని శవమును దీసికొని వచ్చి యతని గుండెకాయఁ బైకి పెకలించి భైరవునికి నివేదనఁ గావించినది పిమ్మటఁ బానమత్తయై నృత్యము గావించుచు నా యొద్దకు వచ్చి యనేకవికారములు జూపుచు నా జపమాలికను హరింపఁ బ్రయత్నించినది.

అప్పుడు నేను దానిని మంత్రబద్ధం గావించి యీ త్రిశూలము గాల్చి దాని కుడిపిరుదుపై వాతపెట్టి దాని మెడలోనున్న యీ ముక్తాదామంబు లాగికొని వదలి వేసితిని. ఈ హారము తాపసులకడ నుండఁ దగదని మా శిష్యునికిచ్చి యమ్ముకొని రమ్మని చెప్పితిని. ఇదియే దీని వృత్తాంతమని పలికిన విని గ్రామాధ్యక్షుండు విస్మయకులహృదయుండై యేమి చేయుటకుం దోచక యప్పుడే రాజునొద్దకుఁ బోయి యా హారమును జూపుచు శ్మశానవాసి చెప్పిన కథ యంతయుం జెప్పి యిప్పుడు గర్తవ్వ మేమియో మీరే యోచింపుడని చెప్పిన విని యా నృపాలుం డాలోచించి యప్పుడే యొక వృద్ధురాలిని రాజభటుల వెంట బద్మావతి యింటి కనిపి పరీక్షించి రమ్మని నియోగించెను.

ఆమె వచ్చి పద్మావతి కుడిజఘనంబుపై త్రిశూలాంకమున్నదని చెప్పినది. మఱి యిరువుర వలన నా మాట ధ్రువపఱచుకొని నరేంద్రుండు అక్కటా? నాముద్దు పట్టిం గడతేర్చిన ఢాకిని యిదియే. పగలిట్లుండి రాత్రుల విహరించి జంతువున