పుట:కాశీమజిలీకథలు -09.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26]

పద్మావతి కథ

201

గొన్ని ముప్పులు రాఁగలవు. నేనే తెలిసికొంటినని పలికిన లోపమేమి వచ్చును. అని యాక్షేపించిన విని రాజపుత్రుండు యథార్థకధథవలనఁ బ్రమాదమున్నదని నాకుఁ దెలిసినదికాదు. నేనే చేసితినంటినేని మఱియొకటి యడిగిన నేమి జేయుదును. ఆమెకు నీయందు గౌరవము గలుగునిమిత్త మట్లు చెప్పితిని. నిన్నెంతయో పొగడినది. నీకు సపర్య చేయనందులకు మిక్కిలి పశ్చాత్తాపము జెందుచున్నదని సమాధానము చెప్పెను.

వారట్లు మాట్లాడుకొనుచుండఁగనే తెల్లవారినది. ప్రాతఃకృత్యంబులు దీర్చుకొని యా మాటలే ముచ్చటించుకొనుచున్న సమయంబునఁ బద్మావతిసఖురా లొకతె యరుదెంచి తాను దెచ్చిన పంచభక్ష్యాన్న తాంబూలాదులు వారి యెదురనుంచి వారికి నమస్కరింపుచు మంత్రిపుత్రునితో నార్యా! నేను పద్మావతి సఖురాలను, ఆమె మీ సేమము దెలిసికొని యర్చించి రమ్మన్నది. ఈ భక్ష్యభోజ్యాదులు మీ నిమిత్తము స్వయముగా వండి యిందుఁ బంపినది. మీ మిత్రు నాహారమున కందుఁ బంపనున్నది. అని యతినిపుణముగాఁ బలుకుచు విని మీరు భుజింపుఁడని మంత్రిపుత్రునకుఁ గొన్ని పిండివంటలు నిరూపించి చూపుచు నవి యందుంచి యాపైదలి పద్మావతి యొద్దకుఁ బోయినది.

పిమ్మట రాజపుత్రుఁడు వయస్యా! నీ వే మేమో పలికితివి. పద్మావతికి నీయం దెంతప్రీతియో తెల్లమైనదియా? స్వయముగా వండి పిండివంటకములఁ బంపినది. నిన్న నాతో నెంతఁగా బొగడిన దనుకొంటివి? నీవు వేఱొక్కరీతి శంకింప నడ్డము చెప్పలేకపోయితిని. ఇఁక వీనిని భక్షింతము లెమ్మని పలికిన విని చిఱునగవుతో మంత్రిపుత్రుండు మిత్రమా? నీకొక చిత్రము చూపించెదఁ జూడుము. దాన నా చేడియకుఁ నాయం దెట్టిప్రీతియో తెల్లము కాఁగలదని పలుకుచు నా భక్ష్యములలో నొకదాని నేరి యందున్న సారమేయము ముందర వైచుటయు నా కుక్క దానిం దిని గడియలోఁ బ్రాణము వదలినది.

రాజపుత్రుఁ డావింతఁ జూచి మిత్రుం గౌగలించుకొని అయ్యో? పెద్ద గండము దాటినది. ఇది నీ వెట్లు గ్రహించితివో తెలియదు. నీ మతి కౌశలమునకు బృహస్పతిగూడ నెనగాఁడు. నేను దాని కపటము గ్రహింపలేకపోయితిని. అన్నన్నా అది నిన్నుం బెద్దగా స్తుతింపుచుండ సత్యమని నమ్మితిని. నిన్ను జంపుటవలన దాని కేమిలాభమో తెలియకున్నది. దీని నెట్లు తెలిసికొంటివని యడిగిన సచివసూనుం డిట్లనియె.

వయస్యా! పద్మావతి సఖురాలు భక్ష్యముల నీకును నాకును విభజించుటతో గ్రహించితిని. ప్రతిభక్ష్యము గురుతుఁ జూచుచు నా ముందర నిడినది. నన్ను గడతేర్చుటకు నీ వింటికి బోక సతతము దాని విడువక యందే యుండెదవని తలంచి యిట్టు చేసినది. కానిమ్ము దీనికిఁ బ్రతీకారము గావించములే. అని పలికిన విని రాజ