పుట:కాశీమజిలీకథలు -09.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

సందియముగా నున్నది. వానియెడ జాగరూకుడవై యుండవలయుం జుమీ! అని చెప్పిన నవ్వుచు నృపతి యిట్లనియె.

క. కానిది కాదెన్నటికిని
   గానున్నది మానదెపుడు కాకది దైవా
   ధీనం బీవిధి నెఱిగిన
   ధీనిధి చింతింప డెపుడు దేనికినైనన్.

భట్టీ! భవితవ్యత యెట్లుండునో యట్లు జరుగక మానదు. అందుల కెప్పుడును విచారింపవలసినది కాదు. కపటంబు జేసి నన్ను దీసికొనిపోవదలంచెనా వాని దోషము వానికే ఘటించు నిందులకు వగవవలదని యుపదేశించి వసుమతీపతి యా చతుర్దశినాడు ఖడ్గహస్తుండై యొక్కరుండ నీలపటోత్తరీయముతో బయలుదేరి సాయంకాలమున కాపరివ్రాజకు డెఱింగించిన శ్మశానభూమికిం బోయెను.

సీ. చట చటారావ విస్ఫుటచితానల సము
                  ద్భూత ధూమము గన్నుదోయి ముడుప
    కడలేక మనుజ కంకాళ కపాలాస్తి
                  చయము లెల్లెడ నిండి భయముతో గొలుప
    భూతభేతాళ ప్రభూత ఘోషముఁలతో
                  గలసి పేరు ధ్వనుల్గన మంట
    బాలవృద్ధస్త్రీశవ ప్రతీకములు భీ
                 భత్సరూపమునఁ జూపట్టుచుండ
గీ. బైరవుని దారుణంపు టాకారమనఁగ
   వెలయునట్టి స్మశానభూతలముఁ జేరి
   వెఱపొకింతయు లేక పృథ్వీధవుండు
   వటవిటపిక్రింద నున్న యజ్జటిని గాంచె.

కనుంగొని నమస్కరింపుచు భిక్షకుండా! నేనిదెవచ్చితి. కర్తవ్యమేమి యని ఖడ్గహస్తుండై యడిగిన నతండు స్తుతిపూర్వకముగాఁ జేయవలసిన కృత్యమంతయును దెలియఁజేయుటయు నా సాహసాంకుండు అంధకారబంధురంబైన యాయర్థరాత్రంబునఁ జితాధూమాకులంబగు స్మశానమధ్యభాగముమీఁదుగా దక్షిణముగా రెండుక్రోశముల దూరములో శింశుపాతరువు నరసి పట్టుకొని యాచెట్టు మొదట బొలసుకంపు గొట్టుచు వ్రేలం గట్టఁబడియున్న పురుషశవమును దెంచి సన్యాసి యెఱింగించిన కుణపం బదియే యని నిశ్చయించి యించుకయును వెఱువక చొరవతో నా తరువెక్కి యక్కుణపంబునకు గట్టఁబడియున్న త్రాళ్ళం దెగఁగోయుటయు నాశవము గభాలునఁ గ్రిందఁ గూలినది. పతనవ్యధబేకంబోలె బాబో! యనిపెద్దయఱు పఱచినది.అప్పు డానృపాలుండు జాలింబడి అయ్యో! దీనిని శవ మనుకొని నేలం బడ