పుట:కాశీమజిలీకథలు -09.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25]

విక్రమార్కుని రాజ్యప్రాప్తి కథ

193

జేసికొని యతనితోఁగూడ రాజ్యము పాలింపుమని పలుమారు చెప్పిచెప్పి భార్యతో గూడ నావృద్ధరాజు కాశీపురంబున కరిగెను.

భద్రాయుధుండు ద్వారపాలుఁడై శ్రీధరుండు మిత్రుడై భట్టి మంత్రియై సంతతము విడువక తన్ను సేవింప విక్రమార్క మహారాజు భూభారంబు భరించి ప్రజలం బాలింపుచుండెను. ఒకనాడు విక్రమార్కుండు పేరోలగంబున సమయంబున నొకపరివ్రాజకుం డరుదెంచి యాశీర్వదించి యొక ఫలం బర్పించి తదానతి నాసన్నపీఠంబునం గూర్చుండెను. అప్పు డానృపతి యాఫలంబు భట్టిచేతి కిచ్చుటయు నతండు దానిం బరీక్షించి చూచి యోహా! ఇది యపూర్వము. కృత్రిమమువలె గనంబడుచున్నది, పరీక్షించెదం గాక యని పలుకుచు దాని నేలపై వైచికొట్టెను. చితికినది. అందొకరత్నము దివ్యప్రభాధగద్ధగితమై యొప్పుచుండుటం జూచి రాజు వెఱగుపడుచు సన్యాసి కిట్లనియె.

ఆర్యా! మీరు సర్వసంగవర్జితులు. సమలోష్టకాంచనులు. ఇట్టి మీకీ కృత్రిమఫలం బెక్కడ లభించినది; లభించుగాక మా కీయనేల? మాతో మీకేదేని పని గలిగిన గోరినంతం జేతులు గట్టుకొని కావింపమా? అని పలికిన విని యా పరివ్రాజకుండు నారాయణస్మరణ గావించుచు నరేంద్రా! ఇట్లనుట నీకే తగును. మేము తపస్సిద్దులమగుట సంకల్పమాత్రముననే యిట్టివింత లుత్పన్నంబు లగుచుండును. వీనితో మా కేమియు బ్రయోజనము లేదు. మీతో నొకప్రయోజనము గలిగి 'రిక్త హస్తేన నో పేయా ద్రాజాసం దైవతం గురుం' వట్టిచేతులతో రాజును, దేవుని, గురువును జూడరాగూడ దను నార్యో క్తి ననుసరించి దీని దెచ్చితిని. కాని మఱియొకటి కాదు. నా యభీప్సితము వినుము.

రేపు రాబోవు కృష్ణచతుర్దశియందు నిక్కడకు దక్షణముగా మూడుయోజనముల దూరములోనున్న స్మశానవాటికలో వటవృక్షముక్రింద నొకమంత్రసిద్ధి సాధింపదలచుకొంటి. భూతభేతాళము లాసిద్ధి కంతరాయము సేయదలంచుచుండును. నీవు వచ్చి నిర్విఘ్నముగా నాకార్యము నెరవేరునట్లు సహాయము చేయవలసి యున్నది. అని రహస్యముగా బరివ్రాజకుడు విక్రమార్కు బ్రార్థించెను.

అమ్మహారాజు చిఱునగవుతో నోహో! ఇంతమాత్రమునకే ఈస్తోత్రము. చాలు చాలు. మీరు వోయి హోమసంభారంబుల సమకూర్చుకొని యుండుడు. నేను నాటిసాయంకాలమున కచ్చటికివచ్చి మీకు సహాయము గావింతునని యభయహస్త మిచ్చి యంపివేసెను.

తరువాత భట్టి విక్రమార్కునివలన బరివ్రాజకుని కామ్యము దెలిసికొని సిద్ధాదులు స్వాభావిత దేవతలకు రాజపుత్రుల బలి యిచ్చు వాడుక యున్నది. నీతండు కాపాలికుడువలె గనంబడుచున్నాడు. శ్మశానవాటికకు రమ్మని చెప్పుటవలన