పుట:కాశీమజిలీకథలు -09.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కాలమైనదని యర్చకు నడుగుటయు నతండు రాజపుత్రా ! ఇది వ్రాయఁబడి యెంతకాల మైనదో యెవ్వరికిం దెలియదు. నేను గాక మా తాతగాక యతని ముత్తాతయు నెఱుఁగడని చెప్పిన విని విక్రమార్కుండు మీ రెఱిఁగిన తరువాత నిందువ్రాయఁబడిన రీతి నెవ్వరుం జేయలేదా? అనుటయు నా పూజారియు నట్లు చేసినచో నీ యుట్టి యిట్లేల యుండెటిని? తెగి పడి యుండదా? అని యతం డుత్తరము చెప్పెను. అప్పు డారాచపట్టి దరహసితవదనారవిందుఁడై యోహో? జనులకుఁ గామ్యసిద్ధి యింత చేరువనుండ బలు లిచ్చి యన్యజీవనముల హింసింప నేమిటికోయని పలుకుచు భట్టీ నీవాయుట్టి యెక్కి చేరులు తెగఁగోయలేవా?

భట్టి - అమ్మయ్యో? అట్లు కోసిన నా త్రిశూలాగ్రమునఁ బడి సమయనా?

విక్ర - సమసిననేమి? అమ్మవారు ప్రత్యక్షమై యభీష్టముల, నిచ్చునఁట కాదా?

భట్టి - ఏమో. అది యెంత సత్యమో అట్టి సాహసము నేను జేయఁజాలను. అప్రత్యక్షఫలంబున కాసపడి ప్రత్యక్షశరీరమును నొవ్వఁజేయనేల ?

విక్ర - సత్యమని నమ్మియే చేయవలయును. మోక్షము మాత్ర మప్రత్యక్షముగాదా? అందులకై యోగులు దేహమునెంత క్లేశపరచుచుందురో చూడలేదా?

భట్టి - ఏమో బాబు? ఆ త్రిశూలము జూడ నా మేనఁ గంపము జనించుచున్నది. వేగ మింటికిఁ బోవుదము రండు.

విత్ర - శ్రీధరా? నీవాయుట్టి యెక్కలేవా?

శ్రీధ - ఉట్టిమాట యటుండనిండు. చెట్టే యెక్కలేను.

విక్ర - భద్రా! నీవో?

భద్ర - నా కట్టిసాహసము లేదు. మహారాజా?

విక్ర - అర్చకుఁడా! నీవైన నట్లు చేయరాదా? యభీష్టములఁ బడయుదువు గాక.

అర్చ – తండ్రీ! నా కట్టి సాహసమే యున్నచో నీ పూజారితన మేల చేసికొందును.

విక్ర - ఆహా! ఈ శాసనము లిఖించి యెంతోకాలమైనను నొక్కరుండు నిందలి నిజానిజంబులు పరీక్షించినవాఁడు లేకపోయె. లోకమెంత వ్యక్తిశూన్యమైనది . దీని యథార్ధము తృటిలో నేను గనుంగొనియెదఁ జూడుఁడని పలుకుచు.

మ. కటిచేలంబు బిగించి కేశములు చక్కంజుట్టి చేతుల్ సము
     త్కట భంగిన్మహి రాచిలేచివెస నుత్సాహంబు దీపింప నా