పుట:కాశీమజిలీకథలు -09.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

క. నగరవిశేషంబుల జూ
   డగబోయినజాడ గనబడదు నేడిట నీ
   నగుమొగము గనగ నన్నడు
   గగ వచ్చినయట్లు తోచెగద యదియేమో ?

వేగ వివరింపుమని యడిగిన వాడు ముసిముసి నగవులతో స్వామీ! మీరెఱుగనిదిలేదు. నిన్న బెద్దదూరము నడచివచ్చుటచే నొడలు బడలియున్నది. నే డెందునుం బోలేకపోయితిని. అట్లయినను నేఁడు మీరు నాకీయవలసిన భృతియందక విడుచువాడనుగాను వినుడు.

గీ. విక్రమార్క మహారాజ చక్రవర్తి
    సాహసాశ్చర్య వితరశౌర్యధైర్య
    ముఖ్యసుగుణంబు లెన్నంగమూఢునకును
    మేను గరుపొంద గలుగనే మానసంబు.

గీ. అక్కడక్కడవచ్చు కధాంతరముల
    జెప్పితిరి తచ్చరిత్ర సంక్షేపముగను
    మున్ను నాకిప్డు మది తృప్తి బొందనమ్మ
    హాత్ముకథలెల్ల దెలుపు డాద్యంతముగను.

అని వేడుకొనుటయు నమ్మహాత్ముండు పరమానందబంధురహృదయుండై మణివిశేషంబున దద్కథారహస్యములెల్లం దెలిసికొని యిట్లుం చెప్పదొడంగెను.

సీ. కాలకంఠుడు మహాకాలాభిధాసుడై
               యెందుభక్తులకోర్కె లిచ్చుచుండు
    శైలకన్యక మహాకాశినాపేర్పొంది
               వసియించునే పురప్రాంగణమున
    చంద్రాన్వయావనీ చక్రవర్తులుమున్ను
              పాలించిరే మహాపట్టణంబు
    మాళవదేశభూమండనంభై యొప్పు
              బేర్మిమై నేవుట ఖేదనంబు

గీ. పుడమి మోక్షప్రదంబులౌ పురములేడు
    వానిలో విశ్వకర్మచే బూని సకల
    సంపదల కాస్పదముగా నిర్మింపబడియె
    నేపురం బట్టి యుజ్జయినీపురంబు.

మహేంద్రాదిత్యుండను మహారాజు విపక్షబలసూదమనుండై మహేంద్రుండువోలె నాప్రోలు పాలించుచుండెను. పార్వతిలక్ష్మీసరస్వతులకు దులయగు శీలముగల సౌమ్మదర్శనయను భార్యతో బెద్దకాలము రాజ్యము జేసియు సంతానము బడయక నా