పుట:కాశీమజిలీకథలు -09.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దేమి? దొంగలు గొట్టిరా ఏమి? నీ వేపనిఁ జేసిన నిట్లే జరుగునని తిట్టుచు నీవు పోయినపని యేమైనది చెప్పుమని యడిగినంత నతం డెట్టకే దెలివిఁ దెచ్చుకొని యిట్లనియె.

నీవు రాకాసివి. నీకు దోచినంతఁ జేయుదువు వలదన్న దిట్టుదువు. నీ నోటికి వెఱచి ప్రతిఁ జెప్పజాలకున్నాను. దేవతలు కొట్టినఁ గోరిక లిత్తురా అని నే ననిన నేమేమో ప్రగల్భములు కొట్టితివి. గొడ్డలి యెత్తితినో లేదో పెద్దరూపముతో నొకదేవత యెదుర నిలువంబడి నాజుట్టు పట్టుకొని చావఁగొట్టినది. అబ్బా! ఆదెబ్బలకు నేనుగావున బ్రతికితిని; మఱియొక డైనఁ జావవలసినదే. చిదుగఁగొట్టి వదలిపెట్టినది వెండియుం దల్లికడుపున జనించితినన యూర్పులడవఁ జెప్పిన విని యాజెగజంత యిట్లనియె.

నీవు మొదటనే యపశకునపు మాటలాడితి వంతకన్న నెక్కువ జరుగునా? ఆ కాపువాఁడు దాని మగఁడా యేమి? ఆ పాడుముండ వానికట్టి వరములిచ్చి నిన్నిట్లు కొట్టనేల? ఆ మాట లడుగలేకపోయితివా? పెద్దగొంతుక పెట్టుకొని నాయొద్ద నేడ్చెదవు. మఱియొకచోట మాటాడనేరవు? మా మంచిపని జరిగినది. నాకు సంతోషమైనదని పలుకుటయు నతడు అయ్యో! ఆ యమ్మవారు బ్రహ్మాండమంతయై జుట్టు పట్టుకొని తన్నుచుండ నేమో యడిగితికానని యాక్షేపించుచుంటివి నన్నుఁ కనుకనే విడిచినది మఱియొకరినైన నప్పుడే చంపివేయునని చెప్పి యతండు మఱియు నిట్లనియె.

నీతో మరియొకమాట చెప్ప మరచితిని. మనము నిత్యమా కాఁపువానికి రెండు సేరులు నేతి నిచ్చుచుండ వలయునఁట. ఇదియొక జట్టీమీఁద బడినది. వానికిఁ దానిచ్చుట మరచినదట. ఈయకున్న మనపని పట్టెదనని చెప్పినదని యాకథ చెప్పిన విని యా మండోదరి ఆ! రమ్మనుము తనకుఁగూడ నిత్యము పేడనీళ్ళు గొట్టుచుండెద నా సంగతి యెఱుంగదు. నీ మెత్తతనము గనిపెట్టి యట్లన్నది. అని నోటికి వచ్చినట్లుగా నా యమ్మవారిం దిట్ట మొదలుబెట్టెను.

అప్పుడా మండోదరి యుదరంబు కడవయంతగా నుబ్బి యూపిరి యాడక నేలంబడి కొట్టుకొనుచుండెను. దేవతాద్రోహ మూరకపోవునా! చుట్టు పక్కలవారు ప్రోగుపడి జరిగిన చరిత్రమంతయు విని నవ్వుచు మండోదరితో నిత్యము కాఁపువానికి నేయి నిచ్చెదనని దండము బెట్టుకొనుము. లేకున్నఁ జచ్చిపోయెదవు. నీకు జడియుటకు మనుష్యులా యేమి? మూఁడులోకములు పాలించుతల్లిని నిందింపవచ్చునా? అని చెప్పుచు వారు బలవంతమున దానిచే నట్లు చేసెదనని యమ్మవారికి దండము పెట్టించిరి. అంతలోఁ గడుపుబ్బు తీసినది.

దాని మగఁడప్పుడే పోయి రెండు సేరులు నేయి తెచ్చి యా కాఁపువాని కిచ్చి దండము పెట్టెను. ఆ మఱునాఁడు నేయి తెచ్చుటకు, గొంచెము జాగుచేసినంత దాని కడు పప్పుడే యుబ్బుటకుఁ ప్రారంభమైనది. జడియుచు వడి వడి పోయి నేయి