పుట:కాశీమజిలీకథలు -09.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మండోదరి కథ

171

వనవుడు భయముమీద జరిగిన పనులు భక్తిమీద జరగవు. ఆ శంకలతో బనిలేదు. నీవందుబోయి యట్లుచేయుదువా? ఒకటేమాట చెప్పమని పలికిన నాత డేమియు ననలేక చేసేదనని యొప్పుకొనియెను. నాటి రాత్రి మండోదరి పెద్దగొడ్డలి యొకటి తెచ్చి యింటబెట్టినది. జాము తెల్లవారగట్ల మగనిలేపి చేయవలసిన విధానముజెప్పి గొడ్డలియిచ్చి యడవి కనుపుచు భోజనపదార్థములు తప్ప మరియొక కోరిక కోరకు సుమీ? అని పలుమారు చెప్పి యంపినది.

అత డాగొడ్డలి మూపుపై నిడుకొని యడవికింబోయి యా యమ్మవారున్న చావడి వెదకి పట్టుకొని యట్టె గొడ్డలియెత్తి కొట్టబోవునంత గల్పాంతసముద్దీప్తమేఘగర్జారవమువలె భయంకరముగా గేక వైచి ఎవడవురా? నన్ను గొట్టజూచుచున్నావు పాపాత్ముడా? అని యదలించుచు వాని జుట్టుపట్టుకొని వంచి యొడలెల్ల జిట్ల గొట్టినది

వాడు మొఱ్ఱోయని యరచుచుఁ దల్లీ! రక్షింపుము. ఇది నాకుఁబుట్టిన బుద్ధిగాదు. ఆ కట్టెలమ్మువా డిట్లు చేసిన వరములిచ్చితివని విని నా భార్య యట్లు చేయుమని పంపగా వచ్చితిని. ఈ యపరాధము మన్నింపుమని వేడుకొనగా నా యమ్మవా రిట్లనియె.

ఓరీ! వాఁడు దరిద్రుఁడు. దెలియక నన్నుఁ గొట్టబోయెనుగాని నీవలెనే యెఱిఁగి చేయలేదు. ఇది నీ భార్య ప్రోత్సాహమా? కానిమ్ము ఆ కట్టెలవానికి నే నాహార పదార్థములన్నియు నిచ్చితిని కాని నేతినిచ్చుట మరచితిని. పాపము వాఁడు నిత్యము నిరభిగారపు టోగిరము తినుచున్నాఁడు. నీవు ప్రతిదినము వానికి రెండు సేరులు నేతినిచ్చుచుండెదనని యొప్పుకొంటివేని నిన్నిపుడు విడిచెద. లేకున్న మడియ జేసెద నేమనియెదవని యడిగిన వాఁడు గడగడ లాడుచునట్లే చేసెదనని యొప్పుకొనక తీరినదికాదు. ఇప్పు డొప్పుకొని యానక నెగవైచిన నా మహిమ యెఱుగుదుగాక జాగ్రత్త. పో పొమ్ము. నిన్నుఁ జూచి విడిచితినని జుట్టు వదలి యమ్మవారు వానిఁ ద్రోసివేసినది. ఆ త్రోపు విసరున వాఁడెట్లో యింటిలో వచ్చిపడెను. లేకున్న వానికిఁ దగిలిన దెబ్బలకు మూఁడు దినములదనుకఁ గదలలేక పోవలసినదే.

ఈ లోపల మండోదరి గదులన్నియు నలికి మ్రుగ్గులు పెట్టినది. స్నానం జేసి క్రొత్తకుండలు మూకుళ్ళు చాల దెచ్చినది. ప్రోయిలమీఁద బెట్టి మగని రాక కెదురుచూచుచు వంటచేయలేదు. బంధువు లెవ్వరయినఁ గనంబడి యిన్ని కుండ లొక్కసారి దెచ్చుచుంటివి. మీ యింట నేదియైన శోభనమా ? అని యడిగిన రేపు సంతర్పణ జేయుదుము. మీరందఱు రావలయుజుఁడీ అని చెప్పుచుండినది.

అంతలో మగఁడు వాకిటకువచ్చి యొడలెఱుంగక పడిపోయెను. మండోదరి దాపునకువచ్చి మగనింజూచి అయ్యో ! అయ్యో! నీ దేహమంతయు నిట్లు వాచిన