పుట:కాశీమజిలీకథలు -09.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22]

మండోదరి కథ

169

ఆహా! దైవము తిండిలేక యెవ్వరిం జావనీయడు. ఎట్లో యాహారము గల్పించుచుండును. ఇంతవఱకు దీని నేను జూచియుండలేదు. ఈదారువు తడవక చేవ గలిగియున్నది. బరువుకావడి పేళ్ళుకాగలదు. నేడు ముసురు కావున నిబ్బడివెల రావచ్చును. మంచియాధారమే దొరికినదని సంతసించుచు దానిచెంతకుబోయి తచ్ఛిరోమధ్యము గురిజూచి గొడ్డలియెత్తి వేయబోయినంత నాయమ్మవారు ప్రత్యక్షమై ఆ! నిలు నిలు మూర్ఖా? నన్నె గొట్టుచుంటివా? నే నమ్మవారినని యెఱుగవా? అని యల్కతో బల్కిన వాడు గొడ్డలి క్రిందబారవైచి చేతులు జోడించుచు దల్లీ! రక్షింపుము రక్షింపుము. నాతప్పు మన్నింపుము. నీవమ్మవారవని యెఱుంగక కొట్టబూనితిని. ఈ చావడిలో నెవ్వరో స్థంభము పాతిరనుకొంటిని. ఎఱింగిన నిన్నట్లు చేయుదునా? అపరాధము అని పాదంబులబడి వేడికొనియెను.

అయ్యమ్మవా రదివఱకు వాడనుకొనిన మాటలన్నియు విన్నది. కావున వానియందు గనికరము గలిగి యోరీ? నీతప్పు మన్నించితి. నీదరిద్రము తెలిసికొంటిని. నీవును నీ పిల్లలును నిత్యతృప్తులగు తెఱంగెఱింగింతు వినుము. నీవింటికింబోయి స్నానముజేసి వంటయిల్లు శుద్ధిచేసి క్రొత్తకుండలందెచ్చి పొయ్యిమీదబెట్టి మూత వేయించుము. మూతదీసిచూడ నీకు గావలసిన యాహారపదార్థము లన్నియు వానిలో నుండును. నీవు నీపిల్లలు నిత్యము తృప్తిగా భుజింపుడు. పో మ్మీరహస్య మెవ్వరికిం జెప్పకుమని పలుకుచు నాదేవి యంతర్థానము నొందినది.

ఆ కాపు మహాసంతోషముతో నా గొడ్డలి యందు బారవైచి యింటికం బోయెను. భార్య మగనిరాక కెదురుచూచుచు నూరక వట్టిచేతు లాడించుకొనుచువచ్చిన మగనిం జూచి నేడెట్లు వేగుననుకొంటిరి. కట్టె లెందును దొరకలేదా? ఈ కాపురము నేను జేయలేనని విసిగికొన, నవ్వుచు దొందరపడకుము. మనము సుఖించు తెఱవొండు భగవంతుడు చూపెనని యా వృత్తాంతమంతయు నెఱింగించెను. ఆ కథవినిన వాని భార్య ప్రహర్షసాగరమున మునుగుచు నప్పుడ పోయి నూతనఘటంబులం దెచ్చి నియమముతో బ్రొయిలమీదబెట్టి మూతవైచి తీసిచూచినంత జతుర్విధపదార్థములచే నవి నింపబడి యున్నవి. పిల్లలు వారు తృప్తిగా భుజించి యమ్మవారిని స్తుతియింపు చుండిరి.

ఆ యొకదివసంబెగాక నిత్య మారీతినే చేయుచుండ గుండలు పదార్దములచే నిండుచున్నవి. వారు దినుటయేగాక యితరులకుగూడ పిండివంటలతో నిత్యము భోజనము బెట్టుచుండిరి.

పొరుగింటి తరుణి మండోదరి యనునది యా కాపువాని పదార్థ సమృద్ధి కని యోర్వలేక యసూయపరత నక్కటా! వాని పెండ్లాము నిత్యము చేయప్పులకై ప్రతియింటిపట్టునను దిరుగునది. ఇప్పుడు దానియందు నేకొఱంతయు లేదు. ఏపదార్థము కొనినట్లు కనంబడదు. నిత్యము పిండివంటలతో సంతర్పణము చేయుచున్నాడు. ఈ