పుట:కాశీమజిలీకథలు -09.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యావతి కథ

167

తండ్రీ! నాగాథ చాల పెద్దది. తరువాత నెఱింగించెదఁగాని నామిత్రుఁడు ముందిందు రాలేదా? అయ్యో? వాఁడు మఱలఁ గాశికి బోయెం గాఁబోలు. వానికి విరక్తి గలిగినదని తలంచుచుఁ దల్లికడకుఁ బోయి కోడండ్రఁ జూపి మ్రొక్కించి చుట్టముల నడిగి బంధువుల నాదరించి సిద్ధార్థుని తలిదండ్రులకడకుఁ బోయి నమస్కరించి యిట్లనియె.

నా మిత్రుఁడు నాకొఱకు చాల కష్టపడియెను. కాశీపురము వదలి రాననిన బలవంతమున వెంటఁబెట్టుకొని వచ్చితిని. దారిలో మాకుఁ గనంబడలేదు. మీకీవార్తఁ దెలుపుటకు నింటికి వచ్చె ననుకొంటిమి వాఁడు కాశీపురంబునకుఁ బోయియుండు. నేనందుఁ బోయి తీసికొని వచ్చెదనని తననేమముఁ దెలుపుచు వారి నూరడించెను.

వారతని రాకకు సంతసించుచుఁ గుమారుని వియోగమునకుఁ బరితపించుచు నుండిరి. ఇంద్రమిత్రుఁడు కుమారునికి వెంటనే పట్టాభిషేకము సేయఁదలఁచి యా సంతోషవార్త మంత్రిముఖముగా వానికి దెలియఁజేసెను. సిద్ధార్థుఁ డింటికి వచ్చినంగాని యేపనియుఁ జేయనని ప్రత్యుత్తర మిచ్చెను. సిద్ధార్థుని కొఱకుఁ బెక్కండ్రు దూతలఁ గాశీపురంబున కనుపుచుఁ జంద్రిక తండ్రియగు భీమవర్మకుఁ దమరాక దెలియున ట్టుత్తరము వ్రాసి యిచ్చెను. మిత్రవియోగశోకంబున మోహానుఁడు భార్యలతో నాప్తులతోఁ దిన్నఁగా మాటాడక తన పోయి వచ్చిన వృత్తాంతముఁ జెప్పక కాలక్షేపముఁ జేయుచుండెను. ఒకనాడు సిద్ధార్థుని దీసికొని వచ్చుటకు మోహనుఁడు పయనం బగుటయు రాజప్రధాను లిద్దరు వచ్చి యాటంకపఱచుచు మేమే పోయి వానిం దీసికొని వత్తుమని చెప్పుచు మఱల మఱికొందఱ వారువపురౌఁతుల వారణాశీపురంబున కనిపిరి.

మోహనుఁ డేమియుం దోచక యొకనాడు ప్రొద్దున్న గుఱ్ఱమెక్కి నగర ప్రాంతకాంతారమునకు విహరింప నరిగెను. ఒకచో నొక వింతయైన రంధ్రములు గల మందసము గనంబడినది. అది యేమియో యని యాలోచించుచు గుర్రమును నిలిపి అందేమి యున్నదో చూడుమని తనవెంట వచ్చిన పరిజనుల కాజ్ఞాపించెను.

వాఁడు దానిప్రక్కకుఁ బోయి యటు నిటు చూచి బాబూ! ఇది బోనువలె నున్నది. దీనిలో మనుష్యుఁ డున్నాఁడు. ఇక్కడి కెట్లు వచ్చినదో తెలియదని తెలిపినఁ దటాలున గుర్రము దిగి యతండు వంగి తొంగిచూచి ప్రాణావసిష్టుఁడైయున్న యొక పురుషుం గాంచి నీ వెవ్వఁడ నిందెట్లు పడి యుంటివని పెద్దయెలుంగున నడిగిన హీనస్వరముతో నన్నీ బోనునుండి యవ్వలికిఁ దీయించిన నంతయుం జెప్పెదనని ప్రతివచన మిచ్చెను.

అప్పుడతండు దానిం బగుల గొట్టించి చూడ సిద్ధార్థుండే యందుండెను. అతని గురుతుపట్టి రాజపుత్రుండు అయ్యో! మిత్రుఁడా! యిందుంటివేల? నిన్నిందుఁ బెట్టినవారెవ్వరు? ఇంత చిక్కితివేల? నీవృత్తాంతముఁ జెప్పుమని పలుకుచు