పుట:కాశీమజిలీకథలు -09.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యావతి కథ

165

సీ. తొలుత మాకీ ధరాతలమెల్ల నల్లని
              కమలినీదళమట్లు కానుపించె
    రానురా నీల సాంద్రచ్చాయ నొప్పియా
              కాశమండలమట్లు కనిపించె
    నంతలోఁ జూడగ నంబుధుల్ జెరువులు
              నదులు దారముల చందమునఁ దోచె
    వీక్షింపఁబడె మహోర్వీధరారణ్యపు
              రస్తోమములు బర్భములు గాఁగ

గీ. నంతలోఁ గానఁబడియె దివ్య స్రవంతి
    చెంత నత్యంత రమణీయ శిఖరగోపు
    రాల యోన్నత మంటపంబైన కాశి
    కాపురంబంత మణికర్ణికా తటంబు.

అప్పటికిఁ గనుచీకటి పడుచుండె. నొరు లెఱుంగకుండ మమ్మిందు దింపి విమానముతోఁగూడ నిరృతి కింకరు లంతరిక్షమున కెగసిపోయిరి. మేమును మెల్లఁగ నటఁగదలి వీథుల నిడిన దీపముల నడుచుచు విశ్వేశ్వరుని యాలయమునకుఁ బోయి ప్రదక్షిణపూర్వకముగా గుడిలోనికిం జని స్వామిని సేవించి యారాత్రి కాకోవెల మంటపములోఁ బండుకొని వేకువజామున లేచి తిరిగి యీగృహం బద్దెకుఁ దీసికొని యిందు వసించితిమి. నేటి యుదయంబున నీ జవరాండ్రు గంగాస్నానంబున కరుగుటయు దేవకన్యకలని పలుకుచు జనులు మూగుచుండిరి. ఆవింతఁ జూచియేకదా? నీవును వచ్చితివి. ఆ గదిలో నున్నవారే తీర్థశుల్కయు విద్యావతియు. నిదియే నా వృత్తాంతము నీవిందు వత్తువనియే విశ్వేశ్వరుని యాలయము గోడ ప్రక్కనొక విగ్రహముక్రింద నొక పద్యము వ్రాసితిని. చూచియే యుందువు, నాపోక విని నా తలి దండ్రు లేమనిరి? అక్కడ విశేషము లెఱింగింపుమని యడిగిన సిద్ధార్థుఁ డిట్లనియె.

ఆహా! మోహనా! సంకల్పసిద్ధుఁడ వనిన నిన్నే చెప్పవలయును. నీ సంకల్పము విని నిన్నుఁ బిచ్చివానిగాఁ గణించితిని. మనుష్యకోటిలో నీయట్టి యదృష్టవంతుఁడు లేఁడు. దివ్యలోకముల జూచి వచ్చితివి అప్రతిమాన రూపసౌందర్యాభిరాసులగు రానులం బెండ్లియాడితివి. ఇంతకన్న జన్మమునకుఁ గావలసిన దేమియున్నది? నీవు మిగుల ధన్యుఁడవని పొగడెను. ఆ దివసము తత్కథాలాపములతో వెళ్ళించిరి. వారు మఱునాఁడు గంగస్నానము జేసి యథావిధి తీర్థ దేవతల నారాధించి విశ్వేశాది మహదేవలింగంబుల సహస్రనామముల నర్చించుచు భక్తిపూర్వకముగా స్తుతించుచు మహానందముతో నారాధించిరి. మోహనుఁడు తలిదండ్రులఁ జూడ నుత్సాహ పడుచు తనదేశమునకుఁ బ్రయాణమగుడు సిద్ధార్థుండు తాను గొన్నినాళ్ళు కాశీపురంబున వసింతుననియు భార్యలతో నీ వింటికిం బొమ్మనియు నతనితోఁ జెప్పినంత