పుట:కాశీమజిలీకథలు -09.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21]

విద్యావతి కథ

161

    మాణిభద్రుఁడు వాఁడె మహిత యక్షాన్వయ
                జాతుండు రాజ రాజ ప్రధాని
    సకియ! విద్యాధరచక్రవర్తి యతండు
               ప్రధిత కిన్నరసార్వభౌముఁ డితఁడు
గీ. రమణీ! రక్షః కులాంబోధిరా జతండు
    సిద్ధవిభుపట్టి వాఁడె ప్రసిద్ధయశుఁడు
    తరుణి సాధ్యప్రభుప్రియతనయుఁ డతఁడు
    వారె చూడుము వసువు లంభోరుహాక్షి!

అని తత్సఖీరత్నము వారివారి కులశీలనామంబు లెఱింగింపుచుండ నాలించుచు నవ్వలికిఁ బొమ్మని కనుసంజ్ఞ జేయుచుఁ గ్రమంబున నెవ్వరిని వరింపక యా సభాచక్రంబున -

సీ. మేలిమిబంగారు మిసిమి మించెడు మేని
              నిగ్గులభూషాంశుల సిగ్గుపరుపఁ
    బట్టుపయ్యెద జమకట్టుపై మెఱయు ము
             త్యాలహారముల డాల్దన్ని యెగయఁ
    జీనాంబరంబు కుచ్చెళ్ళు మీగాళ్ళపై
            జేరి యందంబుగాఁ జిందులాడ
    వ్రేల్ముడితో వ్రేలువెండ్రుకల్ వీపుపై
            మొగులు గ్రమ్మినట్లు సొగసుఁ జూప
గీ. నంఘ్రిమంజీరములు ఘల్లుమనుచు మ్రోయ
   జేతఁ గైదండఁ గైకొని చెలియయోర్తు
   ముందు నడువంగఁ దిరిగె నమ్మోహనాంగి
   యరసి ముమ్మారు తత్సభాంతరమునందు!

అందెవ్వరిని వరింపక క్రమంబున మే మున్నదెసకు వచ్చి యెప్పుడో పరిచయము గలదానివలే నావంక యెగాదిగఁ జూచి చూచి జ్యోత్స్నామంజరులు విసరునట్టు నా మొగముపైఁ దళ్కుచూపులు వ్యాపింపఁజేసినది. అప్పుడు నాకు మేనఁ గంపము గలిగినది. లజ్జావిభ్రమముల కాయత్తమగు చిత్తముతోఁ దత్తరమందుచున్న సమయంబున నయ్యంబుజాక్షి మన్నికటంబున కరుదెంచి మొగంబున మొలకనవ్వులు వెలయించుచుఁ జెలికేలనున్న పుష్పధామం బందిపుచ్చుకొని నామెడలో వైచినది.

స్వప్నమందైన నాకట్టిభాగ్యము పట్టునని తలంచుకొనలేదు, అప్పుడు సభ్యులెల్లఁ గరతాళములు వాయించిది. యక్షుఁడా? సిద్ధుఁడా? గంధర్వుఁడా? రాక్షసుఁడా? యితఁ డెవ్వఁడనువారును, ఎవ్వఁడైన నేమి? ఆరు పరం గావించి వచ్చెననువారును అఖిలపరంబు గావించి వచ్చెననువారును, రాజపుత్రిక పేరులేనివాని వరించిన నేమనువారును స్త్రీలకు స్వతంత్ర మిచ్చిన