పుట:కాశీమజిలీకథలు -09.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరృతిలోకము కథ

157

బోధించిన విని కొంచెము ధైర్యము దెచ్చుకొని యెట్టకేల కటఁ గదలి మధ్యాహ్నమునకు బుణ్యవతీనగరంబునకుం బోయితిని.

అన్నగరంబు వీధులు సౌధంబులు ప్రాసాదంబులు గృహములు వేదికలు అంగళ్ళు అలంకారములు చూచినంత నా హృదయము విస్మయసముద్రములో మునింగిపోయినది. తేజోలోకము దానికడపటి వీధికింబోల నేరదు. అప్పుడీ సౌభాగ్యంబు పరికింపుచుండఁ గొండొకసేపు ప్రియావియోగసంతాపము మరచిపోయితిని.

సీ. అఖిలసామ్రాజ్యంబు హరిసమర్పణఁ జేసి
           పాతాళమునఁ దొక్కబడియె బలియు
    హరిభక్తి నధికవిఖ్యాతిఁజెందియును బ్ర
           హ్లాదుండు తుదకు సన్యాసియయ్యె
    శ్రీరామచంద్రు నాశ్రితుఁడై విభీషణుఁ
          డొకమూల లంకలో నొదిగి యుండె
    రావణాదులు లోక మావలీవలఁ జేసి
          బుద్బదంబుల భంగి పొంగి యడఁగి
గీ. రహహ? దృడభక్తి‌నైన శౌర్యముననైన
   శాశ్వతైశ్వర్యయుత దిగీశ్వరత నిరృతి
   గతి భంజింపఁగ గరిగిరే యితర దనుజు
   లెట్టి తప మాచరించెనో యీ సురారి.

అని తత్పట్టణసౌభాగ్యంబు సూచి నిరృతితపఃప్రభావం బగ్గింపుకు నొక రాజమార్గంబునంబడి పోవుచుండ‌ వొకగేస్తు వెనుకటి దివసమునఁ బస్తుండి నాఁడు బ్రాహ్మణుని కొఱ కెదురుచూచుచు వీధి నిలవఁబడి. యవ్వలఁ బోవుచున్న నన్నుఁ జాచి నీవు ద్విజుండవైతివేని బ్రాహ్మణార్థ మరుదెంతువే? అని యడుగటయు నేను ద్విజుండ నట్లేవత్తునని పలికి వాని వెంట లోపలికిఁ బోయితిని. లోకములన నవియే లోకములు. భవనములన నవియే భవనములు. సీ? భూలోకము నొకలోకమే? మనయైశ్వర్యము లొకయైశ్వర్యములే? జానపదుఁడు వోలె వింతగా నా యింటశోభఁ జూచుచుంటి వంటయైనదని యిల్లాలు చెప్పినంత నన్ను జలయంత్రముల స్నాన మాడఁ జేసి నూత్నపీతాంబరముఁ గట్టనిచ్చి‌ కనకరత్నఘటిత కనకేయూర హార కుండలాది విభూషణముల నలంకృతుం జేసి చందనాగరు కస్తూరీచర్చలఁ గావించి మృష్టాన్నసంతుష్టుం గావించి సుఖాసనోవిష్ణుండనై తాంబూలంబు వైచుకొనుచున్న సమయంబున్న నయ్యజమానుఁడు నన్నుఁ గుశల ప్రశ్నఁ జేసి నీ వెవ్వఁడ వెందుఁ బోవుచున్నవాఁడు విందేమిటికి వచ్చితివని యడిగన నే నిట్లంటిని.

మహాత్మా! నీ యాదరణము వల్లనే నింతకు ముందుఁ బొందిన దుఃఖము మఱచిపోయితిని. తపంబునఁ బరమేశ్వరు మెప్పించి భార్యయు నేను స్వేచ్ఛావిహా