పుట:కాశీమజిలీకథలు -09.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరృతిలోకము కథ

155

వాహన మేదియుం దొరకదు. పుణ్యవతీనగరము పదియోజనముల దూరమున్నదట. ఒక క్రోశము దూరము నడిచితివో లేదో కాళ్ళీడిగలఁబడవైచుచున్నదానవు. పాపము నాకతంబున నీకీ యిడుములు వచ్చినవని యోదార్చిన నవ్విద్రుమోష్టి సరి, సరి నా నిమిత్తమై మీరు విచారింపవలదు. మీ ఖేదమునకు విచారించుచున్నదాన నని పలుకుచు బలము దెచ్చుకొని మఱి పదియడుగులు నడచినది.

మాటలు ధైర్యముగాఁ జెప్పినది కాని యట్లు నడువలేకపోయినది. అప్పుడొక చెట్టుక్రింద గూర్చుండి నేను దానియడుగులొత్తబోయితిని. గాని ముట్టనిచ్చినది కాదు. అంతలో నొకగృహస్థుని బండి యా మార్గమున బోవుచుండెను. దానిలో నిరువురు స్త్రీలు మాత్రము కూర్చుండిరి. ముందొక పురుషుండు బండినడుపుచుండెను. నేను దాని కడ్డముగా నిలువంబడి అయ్యా? మేము పుణ్యవతీ నగరంబుకుఁ బోవుచుంటిమి. ఇది నా భార్య. నడువలేక మిక్కిలి యలయికఁ జెందియున్నది. ఈ బండి యెక్కించుకొనియెదరా? మీకు మంచి సుకృతము రాగలదు. ఈ రాత్రి మీయూరిలో నుండి మఱునాఁడు పోయెదమని యడిగిన నందున్న రాక్షసుఁడు అయ్యో? ఈ మాత్రము పనికే యీ స్తోత్రము? రండు రండు. మీ యిరువురు గూర్చుండుఁడు అని పలికి నన్నుఁ దనప్రక్కను నా భార్య స్త్రీలప్రక్కను గూర్చుండబెట్టుకొని యా శకటమును బటురయంబున నడిపించి యోజనద్వయదూరములోనున్న తమ పల్లెకు దీసికొనిపోయి తమ యింటియొద్ద దింపెను.

రాక్షసస్త్రీలు బండిదిగి నా భార్యను దింపి లోపలికి దమతోఁ దీసికొని పోయిరి. నేనా చోదకునితోఁ బోయి యరుగుమీదఁ గూర్చుంటిని. అప్పటికి గొంచెము చీకటి పడినది. ఆ లోకమందు భూలోకమువలె రాత్రింబగళ్ళు గలవు. సూర్యుఁడు క్రిందిభాగముగా గనంబడును. అందున్న రాక్షసస్త్రీలు చక్కనివారనియే చెప్పదగినది కాని పురుషులేమియుఁ జక్కనివారు కారు.

మేము చేరిన రెండుగడియలకు వారింటికిఁ బాతాళలోకమునుండి నలువురు బంధువులు రహస్యముగా వచ్చిరి. ఆ యింటి యజమానుఁడు వారిని సత్కరించెను. ఇంటి యజమానుడు శుద్ధశ్రోత్రియుండు. వేదవేదాంగములు చదివిన విద్వాంసుఁడు. ఆ యింటికి వచ్చిన బంధువులు శ్రోత్రియులవలె నుండిరి కాని రాక్షసత్వము గూడ మొగంబున సూచించుచున్నది. మా కందఱకు నేకపంక్తినే భోజనముపెట్టిరి. చుట్టాలు మాంసభుక్తులైనను యజమాను డట్టివాఁడు కాకపోవుటచే నన్నమే తినిరి.

భుజింపునప్పుడు నన్నుఁజూచి క్రొత్తరక్కసులు మీరెవ్వరు? ఎందుండి వచ్చితిరి? ఎందుఁ బోవుచున్నారు? అని యడుగఁగా గొంతసేపు నే నేమియు మాటాడితిని గాను పదింపదిగ నా మాటలే యడుగుచుండ నే నిట్లంటి. నేను తపంబు జేసి భార్యతోగూడ బుణ్యలోకంబులెల్ల దిరుగునట్లు వరంబుఁ బొంది స్వేచ్ఛావిహారంబుల భార్యతోగూడ నన్నిలోకంబులు చూచితిని తెలియక నేఁడీలోకము వచ్చితిని. వరశక్తి