పుట:కాశీమజిలీకథలు -09.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

అయ్యా ! ఇది నిరృతిలోకము. నాకముకన్నఁ జిన్నదైనను ప్రభావమునకు శోభకును దానికిఁ దీసిపోవదు. ఇది స్వతంత్రరాజ్యము. సామాన్యముగా నింద్రునిశాసన మిందు సాగదు, ఇందుఁగల రాక్షసులు నీతిమంతులు. రాక్షసకృత్యములు గలవారు కారు. దేవతలకు సహజవిరోధులగుట వీరియం దేదేనిలోపము గనంబడినప్పుడు మహేంద్రుఁడు వారి శిక్షింపుమని నిరృతికిఁ దెలియజేయునుగాని తాను శిక్షింపఁజాలడు. ఈ లోకమునకు రాజధాని పుణ్యవతి. అందే నిరృతి మహారాజు వసించియున్నవాఁడు. మీరు పోయి చూడవచ్చు. నతండు ధర్మాత్ముండని యాలోకవృత్తాంత మంతయుఁ జెప్పెను.

నేను – అయ్యా! ఇక్కడికిఁ బుణ్యవతి యెంతదూరములో నున్నది ?

వాఁడు - పదియామడల దవ్వులో నున్నది.

నేను - దారిలో నేమైన గ్రామములు గలవా ?

వాఁడు - పెక్కురక్కసుల పల్లెలు గలిగియున్నవి. మార్గము నిష్కంటకము. ఇరుప్రక్కల గుసుమఫలదళపల్లవశోభితములైన వృక్షము లనేకములు నాటఁబడియున్నవి.

నేను – రక్కసులు మమ్ము బాధింపరుగదా ?

వాఁడు - ఇందలి దానవులు మౌనులవంటివారు. వీ రెవ్వరిని బాధింపరు. అతిథుల నాదరించి సత్కరింతురు. మఱియొక్క విశేషమున్నదిఁ పాతాళలోకములో నున్న రక్కసులకు వీరికిని బంధుత్వము గలిగియున్నది. ఎప్పుడైన నందలివా రిందు దేవేంద్రునికిని నిరృతినికిని తెలియకుండ వచ్చుచుందురు. వాండ్రయొద్ద రాక్షసకృత్యములు గలిగియున్నవి. కాని యీ లోకవాసులయందులేవు. అని యెఱింగించిన సంతసించుచు నే నాతనియనుజ్ఞ పుచ్చుకొని పుణ్యవతీనగరంబునకుఁ బోవువాడనై బయలుదేరి భార్య నన్ననుసరించి రా నొకదారింబడి నడువసాగితిని. ఒక పెద్దమార్గము పడమరగాఁ బోయినది. స్ఫటికశిలాఘటితమై ప్రతిబింబము గనబడుచుండెను. యాతుధాను లామార్గమునుండి గుఱ్ఱములెక్కియు వాహనములెక్కియు యంత్రశకటము లెక్కియు విమానము లెక్కి.యు వచ్చువారును బోవువారును, మమ్ముజూచి పల్కరించు చుండఁ దగిన సమాధానముఁ జెప్పుచుంటిమి. మేము మెల్లగా నాదారిం పోవుచుంటిమి. కొంతసేపటికి నక్కోమలాంగి నడువలేక మేన స్వేదకళికావసరము బ్రభవింప నడుగులు తడబడ నడుచుచున్న నా ప్రియురాలిం జూచి జాలిపడి కై గలసి వంగి కొంతదూరము దీసికొని పోయితిని.

ఒకచోట జదికిలంబడి యింక నేనడువఁజాల నీరేయి యిందే పండుకొందమని పలికిన విని నే నులుకుఁజెంది ప్రేయసీఁ నేను వలదనిచెప్పినను వినక నావెంటఁబడితివి. ఎండకన్నెఱుఁగక నూర్వురు పరిచారకులు లూడిగములుసేయ భర్మహర్మ్యాంతరముల హాయిగా సుఖించుదానవు. ఈ ప్రయానసము లెట్లుపడగలవు? నే నేమి జేయుదును.