పుట:కాశీమజిలీకథలు -09.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ఇది మాకుఁ బ్రియముకాదు. అధర్మము. రేపు సూర్యోదయము కాకుండ నీయూరు విడిచి పొమ్ము. లేకున్న మేము నీమచ్చ మాపుదుమని మహేంద్రుడు మీ కెఱిఁగింపుమనియె. దీనికిఁ బ్రత్యుత్తర మేమిత్తురని యడిగిన గడగడలాడుచు నాయొడయఁడు ఇతఁడెట్టివాఁడు కానిచో నీవ్యూహమధ్యమునకు రాఁగలడా? ఇది సత్యము కావచ్చునని నిశ్చయించి చేతులు జోడించి యోహో| త్రిలోకాధిపతియగు నింద్రుని సందేశము మన్నింపకుండుటకు నేనెంతవాఁడ! వారి సెలవు ప్రకారము కావించెద ననుగ్రహింపుఁడని చెప్పుము. అని పలికి యతని నంపి సూర్యోదయము కాకుండఁ దన బలముల మరలించుకొని నిజనగరంబునకుఁ బోయెను. నిస్సాహాయుఁడగు మధువర్మ బలములను విజయపాలుని వీరభటులు సులభముగాఁ బారదోలిరి.

రాజు సుమతి చేసిన యుపకారమును వేతెఱంగులఁ గొనియాడుచుఁ దన భార్య యొద్ద నతని సుగుణములఁ బెద్దగా నగ్గించెను. సుమతి గుణవంతుఁడేకాక మిక్కిలి రూపవంతుఁడు. పిన్నవయస్సువాఁడు. రాజుభార్య వానిం జూచినప్పుడెల్ల నుల్లమున నించుక వికారము నొందుచు నంతలో నడంచుకొనుచుండునది. వాని గుణగౌరవము వినిన కొలఁది క్రమంబున నయ్యనురాగము వృద్ధి నొందు చుండెను.

శ్లో. కులీనా రూపపత్యశ్చ నాధత్యశ్చ యాషితః
    మర్యాదాసు నతిష్టంతి స దోషః స్త్రీయం నార్యః

స్త్రీలు మంచి కులంబునంబుట్టినను రూపపతులై నను భర్తగల వారయ్యును నియమము గలిగియుండరూ. స్త్రీలయందుగల పెద్దదోషమిదియే. మఱియు

శ్లో. స్త్రీయంహి యః ప్రార్దయతే నన్ని కర్షంచగచ్చతి
    ఈషచ్చ కురుతే సేవాం స్పృహయంతి కులస్త్రియః.

స్త్రీలు సమీపమందుండి యాశ్రయించు వాఁడెట్టివాఁడై నను వాని ననుగ మింతురు.

రాజపత్ని సుమతి యారాజు బరాక్రమమును తలంచుకొని విదాళిం గుందుచు నొకనాఁడు భర్తతో నిట్లనియె. ప్రాణేశ్వరా! నాకు వీణాపరిశ్రమ చేయవలయునని చాలాకాలమునుండి యుత్సాహము గలిగియున్నది. అయ్యుత్సుక యెప్పుడు మీతోఁ జెప్పక మనసులోనే యడంచుకొని యుంటిని. మీరు మదంకతలంబునఁ దల నిడి వినోదముగా నాకర్ణింపుచుండ మనోహరముగా వీణ పాడవలయునని కోరిక, అయ్యభిలాష తీర్పరా! అని యడిగిన నతండు ఓహో! దీనికి నన్నింత ప్రార్దింప నేల? మంచి వైణికుడు మనయింటనే యున్నవాఁడు గదా! అతఁడు నీ కిష్టుడే. వానివలన నేర్చుకొనుము అని చెప్పెను.

ఆమాట విని రాజుభార్య అవజ్ఞా! మీ సెలవు లేని దెట్టియే కార్యమును చేయనిదాని నగుట ని ట్లడిగితిని. మీరే వాని నాజ్ఞాపింపుడు. అని పలికిన విని యతండు సుమతిం బిలిచి మిత్రుఁడా! తేజస్వినికి వీణ నేర్చుకొనవలెనని యభిలాష గలిగిన