పుట:కాశీమజిలీకథలు -09.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3]

విజయపాలుని కథ

17

మఱియొకనాఁ డొకవైణికుని గాన మాలించి యిం దేమైన లోపము లున్నవా? అని యడిగిన సుమతి తాను మనోహరముగా వీణ వాయించి యితర వైణికునిపాటలో లోపములఁ దెలియఁజేసెను. రాజు సంతసించుచు నీకేయే విద్యలయందుఁ బరిచయము గలిగియున్నదని యడిగిన నన్నివిద్యలు వచ్చునని యుత్తర మిచ్చెను. వెఱగుపాటుతోఁ నీవు మల్లయుద్దముఁ జేయగలవా? అని యడిగినఁ జేయుదునని చెప్పినంత రాజే వాని దానిలోఁ బరీక్షించి యోడిపోయెసు. అదిమొదలు రాజునకు వానియందుఁ బ్రేమగలిగియున్నది. ఒకనాఁడు సుమతి రాజు భోజనముఁ చేయుచుండ దండను గూర్చుండి వినోదములగు కథలు చెప్పుచుండెను. అప్పుడు వంటవాఁ డేమియో పిండివంట వడ్డించెను. సుమతి వాని వైమనస్యము గ్రహించి యా వంటకముఁ దినకుండ నాటంకపఱచి యిందేదియో దోషమున్నదని నిరూపించి చెప్పెను.

రాజు దాని నావంటవానిచేఁ దినిపించుటయు వాఁడది తినిన గడియలోఁ గన్నులు దేలవైచుచు మహారాజా! నే నపరాధిని. నీ శత్రుఁడు మధువర్మ ప్రేరణంబున నీ యింట వంటవాడుగాఁ బ్రవేశించి వంటకంబున విషంబిడితిని. సుమతి నా కపటము గ్రహించెను. నిజము చెప్పితిని. నన్ను రక్షింపుము నా దారి నేను బోయెదనని ప్రార్థించెను.

రాజు సుమతిం గౌగిలించుకొని ప్రాణదాత వైతివని పొగడుచుఁ దదనుమతిని వంటవానికి విషగ్రసనమగు నోషధి నిప్పించి మన్నించి విడిచివేసెను. రాజునకు నాటంగోలె సుమతియందు మఱియు ననురాగ మధికమై ప్రాణముకన్న నెక్కువగాఁ జూచుచుండెను. విజయపాలునకు సహజవిరోధియగు మధువర్మ వంటవానివలన సుమతివృత్తాంతము విని శత్రు డధికుండై యున్నవాఁడని తలంచి మిక్కిలి బలవంతుఁడగు మందపాలుఁ డనునృపాలు నాశ్రయించి విజయపాలునిమీదికి దండెత్తఁ దోడురమ్మని కోరుకొనియెను.

ఇరువురురాజులు చతురంగబలముతో బయలుదేరి హటాత్తుగా నొకనాఁటి సాయంకాలమున విజయపాలుని నగరము ముట్టడించిరి. విజయపాలుండది యెఱింగి శత్రుబరాధిణ్ణమునకు వగచుచు సుమతిం జేరి యిప్పుడు మనమేమి చేయఁగినది దీనుండై యడుగుటయు నతండు ధైర్యముతో మహారాజా! వెఱవకుఁడు సూర్యోదయములలోపల శత్రుబలముల మనపురము విడిచిపోవునట్లు చేసెదఁ జూడుము నాప్రజ్ఞ అని ధైర్యము గఱపి నాటి యర్థరాత్రమున లేపనాలంకృతవిగ్రహుండై తనకుఁ గలిగియున్న యంజనప్రభావమున నదృశ్యుండై మదనపాలుడున్న....బోయి నిద్రించుచున్న యతని లేపి భూపా! నే నింద్రునిదూతను. మాయింద్రుడు నీ కిటుల జెప్పిరమ్మని నన్నంపెను. వినుము. విజయపాలుఁడు మిక్కిలి ధర్మాత్ముండు. జనప్రియుడు. మధువర్మ కడు దుర్మార్గుఁడు. వాని ప్రోత్సాహమున నీవు సుగుణారతుండగు విజయపాలునిమీఁదికి దండెత్తివచ్చితివి.