పుట:కాశీమజిలీకథలు -09.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యజ్ఞదత్తుని కథ

131

బరిహాసముగా నా వ్రేలి యుంగరము లాగికొంటివి. జ్ఞాపక మున్నదా? దాని నిటు దెమ్ము. పనియున్నదని యడిగిన నా సోమిదేవి యిట్లనియె.

నాథా! మీ యుంగర మెక్కడికిం బోలేదు. పెట్టెలోఁ బెట్టి దాచియుంచితిని. మడిఁ గట్టికొంటి. సగమ వంటయైనది. అన్నార్థులై యతిథులు వేచియున్నారు. ఇప్పు డింత తొందరయేల? ఆనక తీసియిచ్చెద స్నానంబు గావింపుఁడని పలికిన విని యతండు కటకటంబడి యోహోహో! ఎంత సత్యసంధురాలవు, ఎట్టి సత్పుత్రజనయిత్రివి? అని యాక్షేపించుచు -

సీ. స్వాద్యాయమెన్నంగు జదువకుండిన బొంకి
                చదువుచున్నాఁడని జరిపినావు
    స్నానంబు నొకనాఁడు సల్పకుండఁగ బొంకి
               తీర్థమాడునటంచుఁ దెలిపినావు
    సంధ్యాభివందనార్చనలు సేయకయుండ
               చేయునటంచు వచించినావు
    వ్రేల్వకుండిన నగ్ని వేళకు నిత్యంబు
               నర్చించునని బొంకులాడినావు
గీ. ఇటుల దబ్బరలాడంగ నేమివచ్చె
    నీకు నీమాటలేను మన్నించి యకట !
    కొడుకు సాధుగ రక్షించుకొనఁగలేక
    పాడుజేసితి పరమనిర్భాగ్యురాల?

అని నిందించుచు మందసంబు లన్నియుం దీసి పరీక్షించి యే వస్తువుం గానక పరితపించుచు భ్రుకుటివికటముఖుండై ఛీ! ఛీ! కుపుత్రత్వంబుకంటె నపుత్రత్వంబె మేలు తిల లిటు తెమ్ము. నీ కొడుకు నీకు నివాపాంబలుల నిత్తునని పలుకుచు స్నానంబు జేయక భుజింపక భార్యతోఁ గలహింపుచుండ నపరాహ్ణమైనది.

అంతలోఁ దనకు వేళయగుటయు యజ్ఞదత్తుండు ద్యూతశాలనుండి యింటికి వచ్చి వీధి నిలువంబడి లోపలి యల్లరి యంతయు దాదులవలన విని యట నిలువక యా యూరు విడిచి యొక మహారణ్యంబునంబడి పోవుచుండఁ బాటచ్చరు లెదురుపడి వానిం ధనికుఁ డనుకొని జావగొట్టి వానియొద్ద నేమియు లేకునికి వగచుచు బ్రాణావశిష్టుండై పడియున్న యాతని మోచుకొనిపోయి యొక రెడ్డిపల్లెలోఁ బడవేసి పోయిరి.

అందొక కాఁపు వానియాపద దెలిసికొని యక్కటికంబుతోఁ దనయింటికి దీసికొనిపోయి కట్టులు కట్టించి పట్టులు వయిచి గాయములు వాపి కొన్ని దినంబులు తనఁయిoటఁ బెట్టుకొని కాపాడెను. పాడిపంటలుగల యా రెడ్డియింట గుడిచి యజ్ఞదత్తుండు ఆఁబోతువలె బలిసి యెలప్రాయములో నున్న యా కాఁపు పట్టికి వలపు