పుట:కాశీమజిలీకథలు -09.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తరుగునవికావు. మిమ్ము సుఖము విడువదు. మమ్ము దుఃఖము విడువదు. అని యెఱింగించిన విని రాజపుత్రుం డిట్లనియె.

మహాత్మా! మా యైశ్వర్యములు మా సుఖములు మా భోగములు మీ పాదరేణువునకు సరికావు. మీరు తలంచుకొనిన మేరువును రేణువునుగాను, రేణువు మేరువుగాను జేయఁగలరు. నా యభీష్టము మీ కెఱింగించితినికదా! నా యభిలాషఁ దీర్ప మీరు సమర్థులుకాకపోరు. నేను మీ యనుగ్రహపాత్రుండఁ గావలయునుం గదా? అని వినయముతో వేడుకొనిన నత డిట్లనియె.

రాజపుత్రా! నేను కపటముగా మాట్లాడువాఁడనుకాను. నీ కోరిక యణిమాదిసిద్ధులుకలవాఁడుగాని తీర్పజాలఁడు. అట్టి యోగి కాశీపురంబున మణికార్ణికాతీర్థప్రాంతమున గంగలో జలస్థంభనఁజేసి జపముజేసికొనుచున్నాఁడని చెప్పుదురు. కాని వానిం జూచినవారులేరు. మఱియు హరిద్వారాది పుణ్యస్థలంబుల నుందురు. వారు సామాన్యులకుఁ గనంబడరు. కనంబడినను మాటాడరు. ఆజ్ఞ మూకజడోన్మత్తులవలెఁ దోచుచుందురు. నాకట్టి శక్తిలేదు. ముముక్షుండనై తీర్థాటనము సేయుచున్నవాఁడ నిప్పుడు రామేశ్వరమునుండి కాశి కరుగుచు మీ వాడుక విని యిందు వచ్చితిని. మీరు చిన్నవారలై నను బుద్ధిమంతులు. ధర్మశీలురు. మీ గుణముల నేను మెచ్చుకొంటిఁ బోయివచ్చెద ననుమతి యిండని పలికిన విని రాజపుత్రుఁ డిట్లనియె.

మహాత్మా! నా కోరిక యసాధ్యమైనదని తెలిసికొనియు నా బుద్ది మరలకున్నది. యశమో మృత్యువో నాకు దీనివలన రానున్నది. మీకు శుశ్రూషఁజేయుచు మీ వెంట వచ్చెద. నన్ను గాశీపురమునకుం దీసికొనిపొండు. ఆ మహాత్ముడుండు తావు చూపుఁడు. అందు మునింగి వాని పాదంబులం బట్టుకొందునని కోరిన నవ్వుచు నాయోగి యిట్లనియె.

రాజపుత్రా! మేము కాలినడకతో దేశములు తిరుగుదుము భిక్షాశనము వలన నాఁకలి లడంచుకొందుము. నీవు సుకుమారదేహుఁడవు. మాతో రాక నీకు సరిపడదు. పరదేశవాసము క్లేశబహుళమగుట నీ సంకల్పము త్రిప్పుకొనుము పుడమి సుకృతకార్యములు సేసి దేహాంతమున లోకాంతరవిశేషములఁ జూడవచ్చునని యుపదేశించిన నా మోహనుండు స్వామీ! నాకు నక్షత్రముల నెట్టివో కన్నులార చూడవలయునని గట్టియభిలాష పుట్టినది. నా కోరిక తీరువఱకు నా సంకల్పము మరలించుకొనను. దీన దేహపాతమైన నగుంగాక. నన్ను మీ వెంటగదీసికొనిపోవక తప్పదని పాదంబులంబడి వేడుకొనియెను. ఆతం డెట్టకేని యంగీకరించెను.

అప్పుడు సిద్ధార్దుం డా యుద్యమ మెఱింగి వయస్యా! నీ సంకల్పము సమంజసమే కాదు. తన కేమియుం దెలియదని నా యోగి చెప్పుచుండ వెనువెంటఁ బోయెద ననియెదవేల? పాదచారివై భిక్షాశనముఁ గుడుచుచు నెట్లుఁబోగలవు? ఆ సిద్ధుం జూడవలయునని యభిలాషయున్నచో నశ్వారూఢులమై మనము వేఱొకప్పుడు