పుట:కాశీమజిలీకథలు -09.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15]

విజయదాసుని కథ

113

కుటీరమున సమున్నతపీఠంబునం గూర్చుండఁజేసి వింజామరలచే వీచుచు రాజోపచారములు గావింపుచుండిరి.

అంతలో నా సన్యాసి బిచ్చమెత్తి కొబ్బరిచిప్పనిండ నన్నము దెచ్చి యచ్చటికి వచ్చెను. వీథులుగాఁ దీర్చిన పటకుటీరములచేత నొప్పుచు నేనుఁగుల ఘీంకారములు, గుఱ్ఱముల హేషారవములు, కాల్బలముల కోలాహలధ్వనులు నింగిముట్ట నా ప్రదేశమొక పట్టణమువలెఁ బ్రకాశించుచుండెను. బైరాగి యానడుమ నడచుచు నయ్యో? ఈ బ్రము లింతలో నెక్కడనుండి వచ్చినవి? ఇందు మా మనుష్యు డుండవలె నేమయ్యెనని యడుగుచుండ వానిమాట నెవ్వరు వినిపించుకొనరైరి. అతండు తిరిగి తిరిగి చెట్టుగురుతుఁ జూచుకొని యా ప్రాంతమునకుఁబోయి యందు వేయఁబడిన పెద్దకుటీరము మ్రోల నిలువంబడి విజయదాసూ! విజయదాసూ! అని కేకలు పెట్టఁగా నంతకుముందు వానినిమిత్తమై వేచియుండుమని నియమించిన దూత బైరాగిం జూచి యరవకుము. ప్రభువు లిందున్నవారు. నీ వెవ్వఁడవని యడిగిన నతఁడీ చెట్టుక్రింద నా మిత్రుఁ డొకండు పండుకొని యుండవలె నతం డేమయ్యెనో యెఱుంగుదువా? అని మఱల నడిగిన నా దూత, ఎఱుంగుదును. రమ్ము. ఆ సన్యాసివి నేవేనా? నీ నిమిత్తమే నన్ను వారిందుంచిరి. అని పలుకుచు నా బైరాగిని వెంటబెట్టుకొని లోపలకుఁ దీసికొనిపోయెను. ఆ సభాపటకుటీరము కొత్తరంగులచే మెఱయుచుఁ జిత్రపటంబులచే దీపించుచు నింద్రభవనమువలె విరాజిల్లుచుండెను.

అందు సమున్నతరత్నపీఠంబున నిరుగెలంకులఁ బంకజముఖులు వింజామరలు విసరుచుండ రాజోపచారము లందుచున్న విజయదాసుం జూచి విస్మయ మందుచు విజయదాసూ? ఈ వైభవమంతయు నెక్కడనుండి వచ్చినది? వెనుక రప్పించుకొంటిరా? ఏమి అని యడిగిన నతఁడు నవ్వుచు స్వామీ! ఇదియేకదా, సుఖప్రారబ్దము విడువదని చెప్పలేదా? నేనిమియు నెఱుగ. జరిగినకథ వీరి నడిగి తెలిసికొనుడు. అని చెప్పిన విని యతండు ఆ! నీవేమియు నెఱుఁగవా? ఈ రా జెక్కడినుండి వచ్చెను. అని వితర్కించుకొనుచు నా నృపతి వలనఁ జరిగినచర్య యంతయు దెలిసికొని వ్రేలు గఱచుకొనుచు విజయదాసూ? నీ వన్నమాట సత్యము. సత్యము. నేనే ప్రమాదముఁ జెందితిని. అగునగు సుఖముగూడ ప్రారబ్ధమే. అనుభవించినం గాని తరుగదు. నీవు నాకు గురుండవయితివి. నీ వంతర్ముఖుఁడవు. నిష్కారణము నిన్ను బాధపెట్టిన నా తప్పు మన్నింపుము. నీవు బోయి రాజ్యమేలుకొనుము. నా దారి నేను బోయెద. జనకుండువోలె నపర్తుండవయి యుండుమని యుపన్యసించి తదామంత్రణంబు వడసి తనదారిం బోయెను. విజయదాసుం డా నృపాలునితో జరిగిన విషయమంతయు చెప్పి యప్పుడు డిల్లీకిఁ బోయి యథాప్రకారము రాజ్యతంత్రములు జరుపుచుండెను. కావున సుఖదుఃఖములు రెండును ప్రారబ్దములే. యనుభవింపక