పుట:కాశీమజిలీకథలు -09.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయదాసుని కథ

109

లలితమణి నిర్మితంబగుటఁ గన్నులకు మిరిమిట్లు గొల్పుచున్నది. అంతకుమున్ను స్యందనారూఢులై పెక్కండ్రు మహారాజులు వచ్చి యయ్యమాత్యప్రవరుని దర్శనమునకై వేచియున్నారు. ప్రతీహారి వారివారి పేరులం దెలిసికొని యవసరము గనిపెట్టి నివేదింప దర్శనమిచ్చి క్లుప్తముగా మాట్లాడి యంపుచుండెను.

ఆ వైభవమంతయు గన్నులార జూచి యా బైరాగి యోహో వీఁడెక్కడి విరక్తుండు. పలుకు వేఱు చేత వేఱుఁగా గనంబడుచున్నది. పొరపాటు వలన నేనింత దూరము వచ్చితిని. ఈ యవివేకి దర్శనముతో నా కేమి పని? పోవుదునా? అని యాలోచించి యంతలో గానిమ్ము రానే వచ్చితిని గదా? ఎట్లో కష్టపడి మాటాడియే పోవుదం గాక! యని తలంచి యా ప్రభువుల సందడి యంతయు నుడుగుపర్యంతము నిలిచి యవకాశము కనిపెట్టి ద్వారపాలకుని యొద్దకుఁ బోయి నాకు మీవిజయదాసుగారి దర్శనము సేయింపఁగలవా? అని యడిగిన నవ్వుచు వాఁ డిట్లనియె.

ఓహో! బైరాగి! విజయదాసుగారని సులభముగాఁ బలుకుచుంటివి. ఇదివర కాపేరున నెవ్వరుఁ బిలువలేదే? నీ వెవ్వఁడవు? వారి దర్శనముతో నీ కేమిపని? నీ బోటివారికి వారు దర్శనమియ్యరు. దూరదేశములనుండి వచ్చిన నృపతులకే చూడ నవకాశము గలిగినది కాదు. వారి సత్ర మా వీథి నున్నది. పొమ్ము నీకు గావలసిన వస్తువుల నిత్తురని పలికిన విని బైరాగి నా కేకోరికయునులేదు. వారితో నొక్క మాటాడి పోవలయునని వచ్చితిని. ఇంచుక యవకాశముఁ జూచి నా మాటవానితోఁ జెప్పుమని యడిగిన వాఁడు పదిదినములవఱకు మహారాజులకే సమయములేదు. నీ కెట్లు గలుగును. తరువాతఁ జూతును. అని చెప్పిన సంతసించుము. నట్లే యుండెదఁ బదిదినములకే తెలుపుమని యా ప్రాంగణ ప్రతోలికయందుఁ గూర్చుండెను. ఎవ్వడోకరతలభిక్ష వలన నాఁకలి యడంచుకొనుచు సంతతము నా ద్వారదేశమునందే కూర్చుండును

పదిదినములు గడచినంత నతండు ప్రతీహరి యొద్దకుఁ బోయి నీవన్న మితి గడచినది. నా రాక చెప్పెదవా? అని యడిగిన సరిసరి. రాజుల సమ్మర్థ మెక్కువ యగుచున్నది. ఇంకొక పదిదినములు పోయినం గాని మాట్లాడుట కవకాశము దొరకదు. అని యీ రీతి మూఁడు నెలలు జరిపెను.

చివరకు సన్యాసికి విసుగు వచ్చినది. కడపట ద్వారపాలునొద్దకు బోయి నే నీగ్రామము వచ్చి తొమ్మిదినెల లైనది. మీ ప్రభు దర్శనమైనది గాదు. ఆయనతో నా కొకప్రయోజనము లేదు. ఒక్క మాటాడిపోవుదును. ఇంత మాత్రపుపనికి మూఁడునెలలనుండి జరుపుచుంటివే? గృహస్థుఁడ వీమాత్ర ముపకారము సేయఁజాలవా? పోనిమ్ము కాదని చెప్పుము. పోయెదంగాక అని పలికిన నులికిపడి వాఁడు నేనేమి చేయుదును? నిన్నుఁ ద్రిప్పుచున్నమాట వాస్తవము. అవకాశము చిక్కకున్నది కానిమ్ము. నేఁడుపోయి చెప్పెద నిందుండుము, అని పలికి యవకాశము గనిపెట్టి లోపలకు బోయి నమస్కరించి దేవా! ఒక సన్యాసి హరిద్వారమునుండి వచ్చి