పుట:కాశీమజిలీకథలు -09.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధవ్రతుని కథ

107

గిన మోహనుఁడు స్వామీ! ఈతడు నా ప్రాణమిత్రుఁడు. మంత్రిపుత్రుఁడు. మా కిద్దరకుఁ గ్రొత్తదేశవిశేషములం జూడవలయునని యభిలాష గలిగియున్నది. మిముఁ బోటి తపోధనుల యనుగ్రహంబునం గాక మా కామితము దీరనేరదు. అని తనయభిప్రాయమెఱుఁగఁ బలికిన విని యా బైరాగి యిట్లనియె.

రాజపుత్రా! మేమును మీ వంటివారమే. మీరు సుఖప్రారబ్ధము, మేము దుఃఖప్రారబ్దము ననుభవించుచుంటిమి. అణిమాదిసిద్ధులు గలసిద్దు లెక్కడోగాని లేరు. అట్టివారి వలనం గాని నీ యభిలాష దీరదు. అని యేమేమో చెప్పిన విని సిద్ధార్థుండు స్వామీ! సుఖము కూడఁ బ్రారబ్ధమేనా? దుఃఖమే ప్రారబ్ధ మనుకొనుచుంటి మనవుఁడు సుఖప్రారబ్ధము దుఃఖప్రారబ్ధ మింతయే భేద మీ యర్థంబు దేటవడ నొకకథఁ జెప్పెద నాకర్ణింపుఁడు.

విజయదాసుని కథ

ఢిల్లీ చక్రవర్తి యొద్ద విజయదాసను మంత్రిపుంగవుఁడు గలడు. అతండు రాజతంత్రములన్నియు జరుపుచున్నను జనకుండు వోలె నిష్కాముండై కామక్రోధాధిదుర్గుణంబుల హృదయం బంటనీయక నువిరక్తితో నొప్పుచుండెను. అతండు గానప్రియుండగుట సంతతము వేదాంతకీర్తనలఁ బాడించి యానందింపుచుండును. తాను గూడ గొన్ని తత్వముల రచించి విపంచిమీఁదఁ బాడుచుండును. అతండు రచించిన తత్వకీర్తనలు ప్రస్థానప్రయోక్తసూక్తుల నభివ్యక్తము సేయుచున్నవి.

ఆ కీర్తనలు తరుచు సన్యాసులు బైరాగులు బాడుచుందురు. కొన్ని దినంబులకు దేశమంత వ్యాపించినని విజయదాసుగారి తత్వము లనిన వేదాంతులు చెవి చేసుకొందురు. ఆ గీతములు విరక్తులకే కాక రక్తులకుఁ గూడ గర్ణామృతములై యొప్పుచుండును.

ఒకానొక హరివాసరమున హరిద్వారంబున బైరాగులు కొందఱు కిన్నరలు మీటుచు విజయదాసు చెప్పిన కీర్తనలం బాడుటయు విజ్ఞానచంద్రుఁడనుసన్యాసి యా తత్వముల నాలించి యుబ్బిగంతులు వైచుచు నోహోహో! యీ గీతములను రచించిన మహానుభావుండెవ్వఁడో? ఎట్టి తత్వవేత్తయో? ఎట్టి విరాగియో? అతం డాధునికుఁడో పూర్వుఁడో వాఁ డిప్పుఁడుండినఁ దద్దర్శనముఁపసి కృతార్థుఁడనగుదుంగదా? అని యాలోచించుచు నతండు ఢిల్లీ పురవాస్తవ్యుఁడు బ్రతికియే యున్నవాఁడను వార్త విని సంతోషించుచు నటఁ గదలి కొన్ని దినంబులకు ఢిల్లీ నగరముఁ జేరెను.

అంకితము వలన విజయదాసని పేరు తెలిసికొని యున్నవాఁడగుట నిందు విజయదాసను తత్వవేత్త యెందున్నవాఁడని కనంబడిన వారినెల్ల నడుగుచుండెను. మాకుఁ దెలియదని సమాధానము జెప్పుచుండెడివారు. ఆరుమాసము లందుండి విమ